
Gold And Silver Price In Hyderabad – Vijayawada: ఒక్క అడుగు. ఒకే ఒక్క అడుగు. బంగారం లక్ష రూపాయల మార్క్‌కు చేరడం ఇక లాంఛనమే. ఒక్క అడుగు వెనక్కేస్తే, రెండు అడుగులు ముందుకు అన్నట్లుగా బంగారం పరుగులు కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువ కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.. దీనికి కారణం అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలు.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు.. ఇలా పలు కారణాలతో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేల మార్కుకు చేరువలో ఉంది. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. 20 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,450, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,580 గా ఉంది. వెండి కిలో ధర రూ.100,000 లుగా ఉంది. కాగా.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,580 గా ఉంది.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,580గా ఉంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,600, 24 క్యారెట్ల ధర రూ.97,730 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,580 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్ల రేటు రూ.97,580 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,450, 24 క్యారెట్ల ధర రూ.97,580 గా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,000
విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,10,000
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.1,00,000
ముంబైలో రూ.1,00,000
బెంగళూరులో రూ.1,00,000
చెన్నైలో రూ.1,10,000 లుగా ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..