
గత కొద్ది రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఈరోజు హోళీ పండగ వేళ మరింత పుంజుకున్నాయి. మార్చి 14న ఉదయం 7 గంటల సమయానికి దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశంలోని పలు ప్రధాన నగరాలతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ మొదటిసారిగా రూ.90 వేల మార్క్ చేరింది. అటు ఇప్పటికే వెండి సైతం లక్ష రూపాయాలను చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో బంగారం, సిల్వర్ కొనాలనుకునేవారికి ఈ పండగ వేళ షాక్ తగిలింది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.88,590కి చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.81,210వద్ద కొనసాగుతుంది.
ఇక తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో బంగారం ధరలు వివరాలు..
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.81,210కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లోనూ ఇవే బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
* ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.81,210కు చేరింది.
* అలాగే ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 88,590 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.81,210కు చేరింది.
* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.88,740, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.81,360 వద్ద కొనసాగుతుంది.
* అలాగే కోల్ కత్తా, బెంగుళూరు, కేరళ, పూణే వంటి నగరాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.88,740కు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..