
పసిడి ప్రియులకు అదిరి పోయే శుభవార్త. భారత బులియన్ మార్కెట్లో గత ఐదు రోజులుగా భారీగా పెరిగిన ధరలకు శుక్రవారం (ఏప్రిల్ 4న) బ్రేక్ పడింది. ఈ క్రమంలో శుక్రవారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,740 తగ్గి రూ.91,640కి చేరుకున్నాయి. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అంతకుముందు గురువారం (ఏప్రిల్ 3) 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.93,380కి ఉంది. చేరుకుంది. అదే వెండి ధర కిలోపై ఏకంగా రూ.4,000 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.99,000 ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో రూ.1,08,000 ఉంది.
అయితే శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా తగ్గాయి. అపరంజి బంగారం ధర రూ.9,200 దిగువకు పడిపోయింది. MCXలో ధర రూ.9,000 దిగువకు పడిపోయింది. ఇది బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాన్ని చూపుతోంది. US కామెక్స్ బులియన్ మార్కెట్లో బంగారం ధర 10% పెరిగింది. 1.4 శాతం తగ్గుదల ఉంది. ఒక ఔన్స్ బంగారం ధర $3,073.
కారణమిదే..
ఇది ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లో మారుతున్న పరిస్థితుల కారణంగా జరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు అమెరికా దిగుమతులపై చైనా 34 శాతం సుంకాలు విధిస్తామని చెప్పడం కూడా ఓ కారణమని అంటున్నారు. మరోవైపు మారిన ప్రజల ఆర్థిక మార్పులు, వృద్ధి అవకాశాలపై మారిన ధోరణుల వల్ల ట్రేడింగ్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని తెలుస్తోంది. ఈ క్రమంలో మార్కెట్ పడిపోయినప్పుడు మంచి లాభాలు రావచ్చని, కానీ, భవిష్యత్తులో మరింత పెరుగుదల కంటే, రేట్లు పడిపోయినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: iPhone Price: ఆపిల్ మొబైల్ ప్రియులకు షాక్.. ఐఫోన్ ధర రూ.2 లక్షలు అవుతుందా? అసలు కారణం ఇదే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి