తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు జెనీలియా. తక్కువ సమయంలోనే తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. బాయ్స్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఎన్టీఆర్, నితిన్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది. కానీ జెనీలియా కెరీర్ మలుపు తిప్పిన సినిమా బొమ్మరిల్లు. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కించిన ఈ మూవీలో హాసిని పాత్రలో తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఇటీవల జూనియర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ మూవీ ఆమెకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇదెలా ఉంటే. ఇటీవల కొన్నాళ్ల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
రీఎంట్రీలో ఒకేసారి తనకు 500 సినిమాలు చేసేయాలని లేదని.. నిడివి తక్కువ ఉన్నా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయాలని ఉందని తెలిపారు. దాదాపు 13 ఏళ్ళ తర్వాత జూనియర్ సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. మజిలీ రీమేక్ వేద్ లో నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిసింది. నువ్వే కావాలి రీమేక్ తుజే మేరీ కసమ్ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చానని.. ఆ తర్వాత తమిళంలో బాయ్స్ సినిమా చేశానని అన్నారు. తెలుగులో సత్యం మూవీ చేశానని.. అన్ని చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
కానీ సత్యం సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ మూవీ చేయొద్దని చాలా మంది సలహా ఇచ్చారని.. బాయ్స్ సినిమా చేసిన యూత్ ఫుల్ పాత్రలే చేయాలని సలహా ఇచ్చారని .. కానీ తన మనసు చెప్పిన మాట విని ఒప్పుకున్నా.. ఆ సినిమా మంచి హిట్ అయ్యిందని అన్నారు. ఎవరైనా వచ్చి సినిమా కథ చెబితే.. అది అర్థవంతంగా అనిపిస్తే చేసేయాలని.. ప్రేక్షకులే ప్రతిభను గుర్తిస్తారని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
