
వేద వ్యాస మహర్షి రచించిన గరుడ పురాణం హిందూ మతంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒకటి. ఇది సాధారణ పుస్తకం కాదు. దీనిని మహా పురాణం అని కూడా అంటారు. ఈ గ్రంథం ప్రజలకు మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ.. మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది. గరుడ పురాణం ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు తన భక్తులకు ఇచ్చిన జ్ఞానం. గరుడ పురాణంలో ప్రస్తావించిన విషయాలను పాటించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం.
- గరుడ పురాణం మతపరమైన నియమాలు, నిబంధనలను ప్రస్తావిస్తుంది. కొన్ని అలవాట్లను సకాలంలో మార్చుకోకపోతే.. ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు. కనుక ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం ఏ అలవాట్లను మార్చుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..
- కొంతమందికి ఇంట్లో అనవసరమైన చెత్తను పోగుచేసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు పేదరికాన్ని ఆహ్వానిస్తుంది. చెత్త పేరుకుపోయిన చోట ప్రతికూల శక్తి త్వరగా వ్యాపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తగాదాలతో నిండిపోతాయి. అందుకే ఇంట్లోని అనవసరమైన వస్తువులను వెంటనే తొలగించాలి.
- ఇంట్లో వంటగది ఒక దేవాలయంలా ఉండాలి. ఎందుకంటే అన్నపూర్ణ దేవి అక్కడ నివసిస్తుంది. అయితే చాలా మంది తమ వంటగదిని శుభ్రంగా ఉంచుకోరు. రాత్రి భోజనాలు ముగించిన తర్వాత ఖాళీ గిన్నెలను రాత్రంతా సింక్లో ఉంచుతారు. ఇలాంటి అలవాటు వల్ల కుటుంబంలో గొడవలు పెరుగుతాయి. కనుక రాత్రి సమయంలో ఉపయోగించిన గిన్నెలు శుభ్రం చేసిన తర్వాతే నిద్ర పోవాలి.
- లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఇల్లు శుభ్రంగా ఉంటే ఆమె సంతోషంగా ఉంటుంది. రోజూ శుభ్రం చేయని ఇళ్లలో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఈ అలవాటు ఇంటి ఆనందానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే గరుడ పురాణం ఇంట్లో పరిశుభ్రత గురించి ప్రస్తావిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు