
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ఈ మూవీలో హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టగా, శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబట్టింది. రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నిజాయతీగల ఓ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్నిఆసక్తికరంగా తెరకెక్కించారు శంకర్. ఇందులో రామ్ చరణ్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా సామాజిక సందేశంతో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాలు సమాజానికి చాలా అవసరమంటున్నారు కొందరు ప్రముఖులు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సినిమాను విద్యార్థులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పలు చోట్ల విద్యార్థుల కోసం స్పెషల్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఏపీలోని తణుకులో ఓ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులకు ‘గేమ్ ఛేంజర్’ సినిమాని చూపించారు. ఐఏఎస్ అధికారి ఎలా ఉండాలో తెలుసుకుని, స్ఫూర్తి పొందాలంటూ విద్యార్థులకు సూచిస్తున్నారు.
ఇక రాజోలు కు చెందిన మెగా ఫ్యాన్స్ తమ గొప్ప మనసును చాటుకున్నారు. గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో నుండి వచ్చిన డబ్బుతో సుమారు 70 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను వితరణగా అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలవుతున్నాయి.
అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు. తమన్ అందించిన పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజైంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.