
ఉదయం లేచింది మొదలు.. ఉరుకులు పరుగలు మొదలవుతాయి. పొద్దున్నే ఏదో ఒకటి తిన్నామా.. బాక్స్ తీసుకెళ్లామా.. ఆఫీసులో పని చేశామా.. ఇంటికి వచ్చామా అన్నట్టు అయిపోయింది. ఈక్రమంలోనే ఉదయం పూట టైమ్ లేదని ఏవి పడితే అవి తింటూ ఉంటారు.
ఇలా ఉదయం కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. వీటి వలన జీర్ణ సమస్యలు మొదలై.. బరువు పెరగడం, కొవ్వు పెరగడం వంటివి జరుగుతాయి. వీటివల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా రావచ్చు. మరి ఉదయాన్న తినకూడదని ఫుడ్స్ ఏంటో చూసేయండి.
ఎప్పుడైనా సరే ఖాళీ పొట్టతో కాఫీ, టీలు తాగకూడదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కనీసం కొన్ని నీళ్లు అయినా తాగి.. కాఫీ, టీలు తాగవచ్చు. వీటి వల్ల కడుపులో హానికరమైన యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి. కొంత మందిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
బ్రెష్ చేసి కనీసం మంచినీళ్లు కూడా తగకుండా.. పొద్దున్నే ఖాళీ కడుపుతో స్పైసీ ఫుడ్స్ కూడా తినకూడదు. వీటికి కూడా చాలా దూరంగా ఉండాలి. ఇవి యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్, అజీర్తికి కారణమై పొట్టని ఇబ్బందికి గురి చేస్తాయి. అలాగే సిట్రెస్ ఫ్రూట్స్ కూడా తినకూడదు.. తాగకూడదు.
తీపి ఎక్కువగా ఉన్నా ఆహారాలు, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, వేయించిన ఫుడ్స్, బెర్రీలు, ఓట్ మీల్, గుడ్లు, గ్రీన్ టీలు, బెర్రీలు వంటి ఫుడ్స్ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోకూడదు. వీటి వలన జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)