
భారతీయ విమానయాన సంస్థలు వేసవి కాలం రద్దీ నేపథ్యంలో అదనపు సర్వీలు నడపడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ సర్వీసులు గత సంవత్సరంతో పోలిస్తే వారపు విమానాలలో 5.5 శాతం పెరుగుదల ఉందని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేసింది. డీసీసీఏ తెలిపిన వివరాల ప్రకారం 2025 మార్చి 30 నుంచి అక్టోబర్ 25 వరకు నడిచే వేసవి కాలంలో భారతీయ విమానయాన సంస్థలు 129 విమానాశ్రయాల నుంచి 25,610 వీక్లీ ఫ్లైట్స్‌ను నడుపుతాయని వివరించారు. ఫిబ్రవరి 2025లో జరిగిన స్లాట్ కాన్ఫరెన్స్ సమావేశం తర్వాత దేశీయ విమానయాన సంస్థ షెడ్యూల్ ఖరారు చేసింది.
సాధారణంగా వేసవిలో భారతీయ విమానయాన సంస్థలు విమాన ట్రాఫిక్‌లో పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఈ ఏడాది రద్దీకు అనుగుణంగా వారానికి 25,610 విమానాలు నడపాలను నిర్ణయం తీసుకున్నారు. గత సంవత్సరం వారానికి 24,275 ఫ్లైట్స్తో పోలిస్తే ఇది 5.5 శాతం ఎక్కువ. 129 విమానాశ్రయాలలో విమానయాన సంస్థలు ప్రతిపాదించిన కొత్త విమానాశ్రయాలు ఉన్నాయని డీజీసీఏ పేర్కొంది. అంబికాపూర్, దాటియా, బీదర్, పోర్బందర్, పాక్యాంగ్, రేవా, సోలాపూర్ విమానాశ్రయాల నుంచి సర్వీసులు నడపనున్నట్లు వివరించింది. అయితే అజంగఢ్ మరియు రుప్సి విమానాశ్రయాల నుండి కార్యకలాపాలు 2025 వేసవి షెడ్యూల్లో నిలిపివేశారు.
ఇండిగో అత్యధిక సంఖ్యలో వీక్లీ డొమెస్టిక్ ఫ్లైట్స్‌ను డీజీసీఏ డేటా ద్వారా తెలుస్తుంది. 14,158 నిష్క్రమణలు షెడ్యూల్ చేసిందని, తర్వాత స్థానంలో ఎయిర్ ఇండియా (4,310), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (3,375) ఉన్నాయని డీజీసీఏ పేర్కొంది. అలాగే స్పైస్‌జెట్ స్లాట్లు గత సంవత్సరం 1,657 నుంచి ఈ సంవత్సరం 1,240కు తగ్గాయి. అలయన్స్ ఎయిర్, ఫ్లైబిగ్ వంటి ప్రాంతీయ విమానయాన సంస్థలు షెడ్యూల్ చేసిన నిష్క్రమణలలో వరుసగా 41.96 శాతం, 30.98 శాతం తగ్గుదలని నమోదు చేసిందని డీజీసీఏ పేర్కొంది. గత సంవత్సరం వేసవి షెడ్యూల్లో 20 ఎగ్జిట్లతో పోలిస్తే ఫ్లై 91 వంటి విమానయాన సంస్థలు 123 ఎగ్జిట్లను అనుమతించడంతో 515 శాతం గణనీయమైన వృద్ధిని సాధించాయని డీజీసీఏ తెలిపింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..