
కొన్నిసార్లు ఏ పని చేయాలన్నా శరీరం అస్సలు సహకరించదు. నిరంతరం అలసట ఒంట్లో శక్తి అంతటినీ లాగేస్తుంది. ఈ సమస్యతో మీరూ బాధపడుతున్నట్లైతే మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రోజంతా ఉహ్సాహంగా ఉండవచ్చు.
ఆరోగ్య నిపుణురాలు పూజా గణేష్ మాట్లాడుతూ.. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అలసట తగ్గించడానికి కొన్ని చిట్కాలను సూచించారు. వాటిని అనుసరించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు.
తరచూ నీరసంగా ఉందటం, అలసిపోయినట్లుగ అనిపిస్తే.. ఇలాంటి వారు ఉదయం పూట అల్పాహారంగా అరటిపండు, నానబెట్టిన శనగలతో ఒక గ్లాసు పాలు తీసుకోవాలని ఆమె సిఫార్సు చేస్తున్నారు. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని నివారించాలి.
అలాగే రోజూ ఖాళీ కడుపుతో 2 ఖర్జూరాలు, 2 ఎండు ద్రాక్షలు, 3 బాదం తినాలి. ఇక ప్రతి రోజూ రాత్రి కనీసం 7 గంటలు నిద్రపోవడం మర్చిపోవద్దు. వారానికి మూడు సార్లు మధ్యాహ్నం గూస్బెర్రీ, ఆపిల్, క్యారెట్ జ్యూస్ తీసుకుంటే ఒంట్లో శక్తి పుంజుకుంటుంది.
మీ రోజువారీ భోజనంలో మొక్కజొన్న, జొన్నలు, ఓట్స్, రాగులు వంటివి చేర్చుకోవాలి. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. పైన పేర్కొన్న సూచనలను ప్రయత్నించిన తర్వాత కూడా మీ సమస్యకు పరిష్కారం లభించకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి.