

Fastest Century in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటే బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే టీ20 క్రికెట్ అనేది తెలిసిందే. ప్రతి సంవత్సరం అనేక రికార్డులు నమోదవుతుంటాయి. కొన్ని బద్దలవుతుంటాయి. ఈ క్రమంలో అత్యంత వేగవంతమైన సెంచరీల గురించి మాట్లాడితే, ఐపీఎల్ చరిత్రలో చాలానే ఫాస్టెస్ట్ సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో అగ్రస్థానంలో నిలిచిన పేరు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ దే కావడం విశేషం. గేల్ కేవలం 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. గేల్ తర్వాత ట్రావిస్ హెడ్, విల్ జాక్స్ వంటి ప్లేయర్లు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.
2013లో పూణే వారియర్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన సమయంలో క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన సెంచరీ ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. ఈ ఇన్నింగ్స్ అత్యంత వేగవంతమైనది మాత్రమే కాదు, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో గేల్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది కూడా ఓ రికార్డు.
గేల్ తర్వాత, యూసుఫ్ పఠాన్ పేరు నిలిచింది. పఠాన్ 2010లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. పఠాన్ చేసిన ఈ సెంచరీ భారత బ్యాట్స్‌మన్ చేసిన వేగవంతమైన సెంచరీలో మొదటి కావడం విశేషం.
తాజాగా పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య చెన్నై సూపర్ కింగ్స్‌పై కేవలం 39 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండవ భారతీయుడిగా ప్రియాంష్ రికార్డులకెక్కాడు.
IPLలో అత్యంత వేగవంతమైన సెంచరీలు (బంతుల పరంగా)
30 – క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 – యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై BS, 2010
38 – డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 – ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 – ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, ముల్లాపూర్, 2025*
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..