ఆరోగ్యాన్ని పెంచడంలో గింజలు కూడా ఎంతో చక్కగా పని చేస్తాయి. గింజల్లో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల్ని నియంత్రించడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది. గింజల్లో అవిసె గింజలు కూడా ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది వీటిని తీసుకుంటూ ఉన్నారు.
అవిసె గింజల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఈ గింజల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది.
ప్రతి రోజూ ఒక రెండు స్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే.. చక్కగా ఫైబర్ అందుతుంది. ఇది జీర్ణ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి.. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.
డయాబెటీస్ సమస్యలతో బాధ పడేవారు ఈ గింజలు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. ఈ గింజల్లో ఉండే లిగ్నాన్స్.. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా పెద్ద ప్రేగు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
తరచూ అవిసె గింజల్ని తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది. జుట్టుకు కూడా బలంగా తయారవుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మహిళల్లో హార్మోన్లు ఇన్ బ్యాలెన్స్ అవకుండా చేస్తూంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)





