
ఈ మధ్యనే ఫర్జీ అనే ఓ వెబ్ సిరీస్ వచ్చింది.. గుర్తుందా అందులో ఓ వ్యక్తి తనకున్న ట్యాలెంట్‌తో నకిలీ నోట్లను ప్రింట్ చేసి వాటిని చెలామణిలోకి తీసుకొస్తాడు. అయితే ప్రస్తుతం అలాంటి మోసమే వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. కొందరు కేటుగాళ్లు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి తయారుచేసిన రూ.500 దొంగనోట్లు ప్రస్తుతం చెలామణిలోకి వచ్చినట్లు కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇవి మార్కెట్లో వచ్చినట్టు తెలిపింది. ప్రజలు వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఈ ఫేక్ నోట్ల వ్యవహరంపై డీఆర్ఐ, ఎఫ్ఐయూ, సీబీఐ, ఎన్ఐఏ, సెబీలను హోంశాఖ అప్రమత్తం చేసింది. ఆ ఫేక్ నోట్స్ అచ్చం నిజమైన నోట్ల మాదిరే ఉన్నాయని.. వాటిని గుర్తించడం కూడా చాలా క్లిష్టంగా మారిందని వెల్లడించింది. కానీ ఆ నోట్ల ప్రింటింగ్‌లో ఓ లోపం ఉందని దాని ద్వారా ఫేక్ నోట్లను గుర్తించ వచ్చని హోంశాఖ పేర్కొంది.
ప్రస్తుతం చెలామనిలో ఉన్న ఫేక్ నోట్లను కేంద్ర హోంశాఖ గుర్తించింది. ఈ నోట్లలో ఒక చిన్న స్పెల్లింగ్ తప్పు ఉందని.. దీనిని గుర్తించడంలో అదే కీలకమని పేర్కొంది. నిజమైన రూ.500 నోట్లో ”RESERVE BANK OF INDIA”అని ఉండాల్సిన చోట, ”RESERVE” అనే పదంలో చివరి ‘E’ అక్షరం స్థానంలో ‘A’ ఉండే విధంగా ముద్రించారని హోంశాఖ వెల్లడించింది. అయితే చిన్న తప్పును గుర్తించాలంటే, నోటును చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇలాంటి నకిలీ నోట్లు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పుగా మారుతాయని అధికారులు స్పష్టం చేశారు. కావున ప్రజలు, వ్యాపార సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలున్నాయి
ఫేక్ రూ.500 నోట్లను గుర్తించండి ఇలా..
- నిజమైన రూ.500 నోటులో RESERVE BANK OF INDIA” అని కరెక్ట్‌గా రాసి ఉంటుంది
- ఫేక్ రూ.500 నోటులో మాత్రం RESERVE అనే పదంలో “E”కి బదులు “A” అనే అక్షరంతో ముద్రించబడి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
మహిళ నుంచి గొర్రెలు కొనేందుకు వచ్చి, ఛీ.. ఎలాంటి పని చేశాడంటే..?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…