
ప్రస్తుత కాలంలో కళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే కళ్లకే ఎక్కువగా పని చెబుతున్నారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్స్, టీవీలు, కంప్యూటర్లు చూడటం వల్ల కళ్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. దీంతో కంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలోనే కళ్లకు అద్దాలు కూడా పడుతున్నాయి. కళ్లు సరిగా పనిచేయాలంటే మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. కంటికి మేలు చేసే ఆహారాన్ని తరచూ తీసుకుంటే.. కళ్లద్దాలకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూడండి.
కంటి సమస్యలతో బాధ పడేవారు తరచూ పాలకూర తీసుకోవడం ముఖ్యం. ఇందులో ఉండే పోషకాలు.. కంటి శుక్లం, మచ్చల క్షీణత, కంటి సమస్యలను నివారించడానికి చక్కగా సహాయ పడతాయి.
బ్రోకలీ తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటిపై ఒత్తిడి పడకుండా అడ్డుకుంటాయి. పుల్లని పండ్లు, ఆకు పచ్చ కూరగాయలు తినడం వల్ల కూడా కళ్ల ఆరోగ్యం అనేది మెరుగు పడుతుంది. ఇవి కళ్లకు రక్షణ పెంచుతాయి.
మీరు తీసుకునే ఆహారంలో గుడ్లు, నట్స్, గింజలు ఉండేలా కూడా చూసుకోండి. వీటిల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. పొడిబారే సమస్యలను దూరం చేస్తాయి. కళ్లను హైడ్రేట్‌గా ఉంచుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)