
ఓలా ఎలక్ట్రిక్ నుంచి మోటారు సైకిల్, స్కూటర్లు విడుదలై మంచి ఆదరణ పొందాయి. వాటిలో ఓలా రోడ్ స్టర్ ఎక్స్ బైక్ రూ.84,999 ప్రారంభ ధరకు లభిస్తోంది. దీని కోసం బుకింగ్ లు మొదలయ్యాయి. 2025 మే లో ఖాతాదారులకు డెలివరీలు అందిస్తారు. దీనిలో 2.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జి చేస్తే దాదాపు 140 కిలోమీటర్లు రేంజ్ వస్తుంది. అలాగే 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వాహనాన్ని రూ.94,999కు కొనుగోలు చేయవచ్చు. దీని రేంజ్ 196 కిలోమీటర్లు.
ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు లక్ష రూపాయల లోపు ధరలో లభిస్తున్నాయి. వీటిలో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన ఎస్1 ఎక్స్ స్కూటర్ ధర రూ.64,999. సింగిల్ చార్జ్ పై 95 కిలోమీటర్లు పరుగెడుతుంది.
3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ.81,999, రేంజ్ 151 కిలోమీటర్లు.
*4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉన్న స్కూటర్ ను రూ.97,499కు కొనుగోలు చేయవచ్చు. ఇది సుమారు 193 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.