
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు ఇప్పటిదాకా తమ పొదుపులను సంప్రదాయ పద్ధతుల విత్‌డ్రా చేసుకునే వారు. కానీ పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో ఓ ఐదేళ్లుగా ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమయ్యే విధంగా విత్‌డ్రా ప్రాసెస్‌ను సవరించారు. అయితే పీఎఫ్ విత్‌డ్రాతో పాటు వివిధ సేవలను వేగంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ కీలక చర్యలు తీసుకుంటుంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్‌ను ప్రకటించారు. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఏటీఎంల ద్వారా కూడా నేరుగా పీఎఫ్ ఖాతాల నుంచి నిధుల ఉప సంహరణకు వీలు ఉంటుంది.
ఈపీఎఫ్ఓ 3.0లో పీఎఫ్ సంబంధిత సమస్యల పరిష్కారానికి పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగే అవకాశం లేకుండా సభ్యుడే నేరుగా ఆన్లైన్ ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పీఎఫ్ విత్‌డ్రా కోసం యజమానులపై ఆధారపడకుండా ఎప్పుడైనా ఎప్పుడైన ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు ముఖ్యంగా ఐటీ మౌలిక సదుపాయాలను గణనీయంగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ సదుపాయాలు సభ్యులకు అందుబాటులోకి రానున్నాయి. పీఎఫ్ ఉపసంహరణలను సరళీకృతం చేయడం, వాటిని మీ బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకున్నంత సులభం పీఎఫ్ విత్‌డ్రా ఫెసిలిటీను సభ్యులకు అందించడమే లక్ష్యంగా ఈ కొత్త అప్డేట్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఈపీఎఫ్ఓ తన పీఎఫ్ ఖాతాలను ఏటీఎం అనుకూల వ్యవస్థతో అనుసంధానించాలని యోచిస్తోంది. అందువల్ల చందాదారులు తమ రిజిస్టర్డ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) లేదా లింక్డ్ బ్యాంక్ ఖాతాల ద్వారా తమ నిధులను యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే విత్ డ్రా సమయంలో మాత్రం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉండనుంది. ఏటీఎం యాక్సెస్‌తో పాటు, ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా కూడా పీఎఫ్ క్లెయిమ్‌లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, భీమ్ వంటి ప్రసిద్ధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా పీఎఫ్ ఖాతాల నుంచి మన బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
ఇవి కూడా చదవండి
ఈపీఎఫ్ఓ 3.0 మీకు ఒక ప్రత్యేకమైన పీఎఫ్ విత్ డ్రా కార్డును అందిస్తుంది. ఇది సాధారణ ఏటీఎం కార్డులా పనిచేస్తుంది. ఈ కార్డు మీ ఈపీఎఫ్ నిధులను మీ సౌలభ్యం మేరకు నియమించిన ఏటీఎంల నుంచి నేరుగా ఉపసంహరించుకునే సదుపాయం కల్పిస్తుంది. నిర్దిష్ట వివరాలతో పాటు ఆమోదిత ఏటీఎంల జాబితా ఇంకా ప్రకటించకపోయినా ఉపసంహరణ ప్రక్రియ సరళంగా, వినియోగదారు-స్నేహపూర్వకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి