
అత్యవసర సమయాల్లో ఈపీఎఫ్‌వో క్లైమ్‌కి నెలల తరబడి నిరీక్షించవల్సిన అవసరం లేదు. క్లెయిమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటానమస్ ప్రక్రియ ద్వారా మార్చి 6 నాటికి దాదాపు 2.15 కోట్ల ఈపీఎఫ్‌వో క్లెయిమ్‌లను పరిష్కరించింది. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తమని సోమవారం (మార్చి 17) కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో కింద 89.52 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు పేర్కొంది.
ఈపీఎఫ్‌లో విత్‌డ్రాకు సంబంధించిన క్లెయిమ్‌ల పరిష్కారం దాదాపు 60 శాతం ఆటోమోడ్‌లోనే జరుగుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరాంద్లజే లోక్‌సభలో ఓ ప్రశ్నకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆటో మోడ్ ద్వారా అడ్వాన్స్ (పార్ట్ విత్‌డ్రాయల్) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ పరిమితిని కూడా లక్ష రూపాయలకు పెంచినట్లు మంత్రి తెలిపారు. అనారోగ్యం/ఆసుపత్రిలో చేరడం వంటి క్లెయిమ్‌లతో పాటు, గృహనిర్మాణం, విద్య,యు వివాహం కోసం పాక్షిక ఉపసంహరణలను కూడా ఆటో మోడ్ కింద ప్రారంభించామని, ఆటో మోడ్ కింద క్లెయిమ్‌లను కేవలం మూడు రోజుల్లోనే ప్రాసెస్ చేస్తామని మంత్రి సభకు తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 6 నాటికి EPFO చారిత్రాత్మక గరిష్ట స్థాయి 2.16 కోట్ల క్లెయిమ్ సెటిల్మెంట్ను సాధించిందని, ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో 89.52 లక్షలకు పెరిగిందని మంత్రి తెలిపారు. అలాగే, ఈపీఎఫ్ఓ సభ్యులకు సంబంధించిన వివరాల్లో తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియను సరళతరం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఆధార్-ధృవీకరించబడిన UAN లను కలిగి ఉన్న సభ్యులు ఎటువంటి EPFO ప్రాసెస్ లేకుండా సొంతంగా తప్పులు సరిదిద్దుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం 96 శాతం తప్పుల సవరణ ఎటువంటి EPF ఆఫీస్‌ల జోక్యం లేకుండా జరుగుతున్నాయని, 99 శాతానికి పైగా క్లెయిమ్‌లు ఆన్లైన్ మోడ్ ద్వారా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 6 నాటికి ఆన్లైన్ మోడ్ ద్వారా 7.14 కోట్ల క్లెయిమ్‌లు ఆన్లైన్ మోడ్ ద్వారా దాఖలైనట్లు తెలిపారు. బదిలీ క్లెయిమ్‌కు ఆధార్-ధృవీకరించబడిన UANలను కూడా తొలగించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 10 శాతం బదిలీ క్లెయిమ్‌లకు మాత్రమే సభ్యులు, యజమాని ధృవీకరణ అవసరమని అన్నారు. KYC- కంప్లైంట్ UANలు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే క్లెయిమ్ ఫారమ్‌తో పాటు చెక్ లీఫ్‌ను సమర్పించాల్సిన అవసరం కూడా సడలించబడింది. EPF ఖాతాలను తప్పుగా లింక్ చేసిన వారికి డీ-లింకింగ్ సౌకర్యాలను కూడా అందించింది. దీని ద్వారా జనవరి 18 నుంచి ఫిబ్రవరి చివరి వరకు 55 వేల కంటే ఎక్కువ మంది ఖాతాలను డీ-లింక్ చేశారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.