
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రానికి కంగనా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాన బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా కంగనా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో రిలీజ్ కు ముందే ఈ సినిమా వివాదాల్లో నిలిచింది. పలు మార్లు వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. కొన్ని చోట్ల బాగానే ఆడినా మరి కొన్ని చోట్ల జనాలు ఈ మూవీని పెద్దగా పట్టించుకోలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. రూ.60 కోట్లతో ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించగా.. కేవలం రూ.21 కోట్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు తెలిపారు. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా ఆహర్యం, అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఎమర్జెన్సీ సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఎమర్జెన్సీ సొంతం చేసుకుంది. మార్చి 17న స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు కంగనానే స్వయంగా ప్రకటించింది. అయితే ఇప్పుడు అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అయితే త్వరలోనే తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. ఎమర్జెన్సీ సిఇనమాలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
The gripping story of power and peril.
Watch Emergency, now on Netflix.#EmergencyOnNetflix pic.twitter.com/2Uny6IxhDw— Netflix India (@NetflixIndia) March 14, 2025
కంగనా ప్రత్యేక పూజలు
Aaj Kateel mein Devi Durga Parmeshwari ji kay darshan kiye aur pichle kal Kapu mein Maa Mariyamma ji ke pawan darshan kiye. pic.twitter.com/bZCffREG5y
— Kangana Ranaut (@KanganaTeam) March 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.