
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. గతేడాది దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ అయింది. 2012లో విడుదలైన ‘సెకండ్ షో’ చిత్రంతో దుల్కర్ తన నట జీవితాన్ని ప్రారంభించాడు.
ఇది కూడా చదవండి : బ్యాడ్ లక్ బ్యూటీ..! పుష్పలో సమంత సాంగ్ ఈ అమ్మడే చేయాలంట.. కానీ మిస్ అయ్యింది
ఆ తర్వాత విడుదలైన ‘ఉస్తాద్ హోటల్’ సినిమా అభిమానుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తెలుగులోకి ఒకే బంగారం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత దుల్కర్ నటించిన సినిమాలు తెలుగులోనూ విడుదలై మంచి విజయాలను అందుకుంది. దుల్కర్ సల్మాన్ మళ్లీ తెలుగు దర్శకుడితో పని చేస్తున్నారని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :టాలీవుడ్ విలన్ భార్య జోరు.. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్.. ఆమె ఎవరంటే
టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్. ఈ సినిమాకు ఆకాశంలో ఓ తార అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ రుహానీ శర్మ నటిస్తుందని తెలుస్తుంది. తెలుగులో చిలసౌ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది హీరోయిన్ రుహానీ శర్మ. చిలసౌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత సరైన క్రేజ్ మాత్రం సొంతం చేసుకోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు దుల్కర్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఈ వార్తల్లో నిజం ఉంటే రుహానీ శర్మ రేంజ్ మారిపోయినట్టే అంటున్నారు అభిమానులు.
ఇది కూడా చదవండి :మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్.. కానీ క్రేజ్ మాత్రం స్టార్ హీరోయిన్స్‌కు తీసిపోదు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.