
సినీరంగంలో పెద్ద స్టార్ కావాలని కలలు కనని నటులు ఉండరు. అందులోనూ విలన్ పాత్రలతో ఫేమస్ అయినవారు చాలా తక్కువ. అందులో సుశాంత్ సింగ్ ఒకరు. దాదాపు 11కు పైగా సినిమాల్లో నటించి అద్భుతమైన నటనతో మెప్పించారు. కానీ అతడికి అంతగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ బుల్లితెరపై నటుడిగా మరింత ఫేమస్ అయ్యారు. సినిమాల్లో సక్సెస్ అందుకోలేకపోయిన అతడు టీవీల్లో మాత్రం రాణిస్తున్నారు. పాపులర్ క్రైమ్ షో సావ్ ధాన్ ఇండియా కు హోస్ట్ గా మారి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 1998లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశాడు.
ఆ తర్వాత 2002లో వచ్చిన జంగిల్ సినిమాతో అతడికి సరైన బ్రేక్ వచ్చింది. ఇందులో దుర్గ నారాయణ్ చౌదరి అనే పవర్ ఫుల్ బందిపోటు పాత్రలో నటించాడు. ఆ తర్వాత జోష్, చార్ ది కీ చాందినీ, లక్ష్య, లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి చిత్రాల్లో నటించి నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఇక తెలుగులో రవితేజ నటించిన దుబాయ్ శీను సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత బుల్లితెరపై సావ్ ధాన్ ఇండియా షోకు హోస్ట్ గా కనిపించి మరింత పాపులర్ అయ్యాడు. ఈ షోతో సుశాంత్ సింగ్ పాపులారిటీ పెరిగిపోయింది. అలాగే టీవీల్లో పలు సీరియల్స్, రియాల్టీ షోలలో కనిపించాడు.
నివేదికల ప్రకారం సుశాంత్ సింగ్ ఆస్తులు రూ.10 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 25 ఏళ్లకు పైగా సినీరంగంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ భార్య మోలినా సింగ్. ఆమె ఒడిస్సీ నృత్యకారిణి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. మోలినా సింగ్ ప్రసిద్ధ నాటక గురు ఇబ్రహీం అల్ఖాజీ శిష్యురాలు. ఆమె ఒడిస్సీ నృత్యం సోలో ప్రదర్శనలు కూడా ఇస్తుంది. జంగిల్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్ మోలినాను వివాహం చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..