
చలికాలంలో ఉదయం వేడివేడి టీ తాగడం ఎంతో సుఖమయంగా అనిపిస్తుంది. కానీ అదే అలవాటు వేసవిలో కొనసాగిస్తే ఆరోగ్యానికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీ లో ఉండే కొన్ని పదార్థాలు వేసవిలో శరీరానికి భిన్నంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కెఫీన్, టానిన్ వంటి రసాయనాలు వేసవి వేడిలో శరీరంపై తక్కువ కాదు.. భారీగా ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు ఆ ప్రభావాలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
వేసవిలో మన శరీరంలో నీరు చెమట రూపంలో విరివిగా బయటకు వెళ్లిపోతుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ద్రవ పదార్థాలు శరీరానికి చల్లదనం కలిగించేలా ఉండాలి. కానీ టీ లో ఉండే కెఫీన్ మూత్ర విసర్జనను పెంచుతుంది. అంటే మన శరీరంలోని నీరు ఇంకా ఎక్కువగా బయటకు పోతుంది. దీని వల్ల త్వరగా నీరు తగ్గి డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.
వేసవిలో ఎక్కువ వేడి కారణంగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంటుంది. అయితే టీ లో ఉండే టానిన్ అనే పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఎసిడిటీ, కడుపు మంట, ఉబ్బసం వంటి సమస్యలకు కారణమవుతుంది.
కెఫీన్ నర్వస్ సిస్టమ్‌ను ఉత్తేజితంగా ఉంచుతుంది. వేసవిలో హీటు వల్లే మనకు నిద్ర సరిగ్గా పట్టదు. ఈ పరిస్థితిలో టీ తాగితే నిద్ర మరింత భంగం కలుగుతుంది. దీన్ని కారణంగా అలసట, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
టీ లోని కెఫీన్ శరీరంలోని తేమను తగ్గిస్తుంది. వేసవిలో సూర్యరశ్మి వల్లే చర్మం పొడి అవుతుంది. టీ తాగడం దీనిపై మరింత ప్రభావం చూపిస్తుంది. దీని ఫలితంగా చర్మం పొడిబారి పగలడం, దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వేసవిలో వేడి కారణంగా గుండె వేగం సహజంగానే కొంచెం పెరుగుతుంది. కానీ టీ లోని కెఫీన్ గుండె స్పందనను ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా కలదు.
టీ లో ఉండే ఆక్సలేట్స్ అనే పదార్థాలు వేసవిలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. నీరు తక్కువగా తాగడం, పైగా టీ తాగడం కలిస్తే ఈ సమస్య తీవ్రంగా అవుతుంది.
వేసవిలో నీరు తక్కువగా తాగడం వల్లే మలబద్ధకం రావచ్చు. టీ లో ఉండే టానిన్ దీనిని మరింత పెంచుతుంది. గర్భిణీలు, వృద్ధులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు.
కెఫీన్ మనస్సును ఉల్లాసంగా చేసేలా కనిపించినా వేసవిలో ఇది ఆందోళనను మరింతగా పెంచుతుంది. వేసవి వేడి వాతావరణం వల్లే మనస్సు అసహనంగా ఉంటుంది. టీ తాగడం వల్ల ఆ అసహనం మరింతగా పెరిగే అవకాశం ఉంది.
వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే టీ లాంటి వేడి పానీయాలను పరిమితంగా తీసుకోవడం మంచిది. టీని ఎక్కువగా విరామం లేకుండా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతో పాటు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీరు, లెమన్ జ్యూస్ లాంటి పానీయాలను తీసుకోవడం వల్ల శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుంది.