

చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో దుమ్మురేపుతుంది డ్రాగన్ . లవ్ టుడే సినిమా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ప్రదీప్ రంగనాథన్. ఈ యంగ్ హీరో కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. లవ్ టుడే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరోసారి యూత్ ను ఆకట్టుకునే కథతో ప్రేక్షకులను కట్టిపడేసాడు ప్రదీప్ రంగనాథన్. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ గోట్ మూవీని నిర్మించిన AGS నిర్మించింది. ఈ చిత్రంలో ఆయన సరసన అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు వారితో కె.ఎస్. రవికుమార్, మైష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది.
తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. డ్రాగన్ సినిమా ఫిబ్రవరి 21, 2025న తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో విడుదలైంది. దాదాపు 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు హిందీలో విడుదల కానుంది. తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో విజయం సాధించిన తర్వాత, ఈ సినిమా ఇప్పుడు మార్చి 14, 2025న బాలీవుడ్లో విడుదల కానుంది.
దర్శకుడు అశ్వత్ దర్శకత్వంలో విడుదలైన రెండవ చిత్రం డ్రాగన్. అంతకు ముందు ఓ మై కడవలె సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రేమ, కాలేజ్ జీవితం, కాలేజ్ తర్వాత విద్యార్థుల జీవితాలు వంటి అనేక ఇతివృత్తాలతో కూడిన చిత్రం ఇది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషలలో విడుదలై ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది. మార్చి 14న హిందీలో విడుదల కానుంది. ఎ.జి.ఎస్. ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి స్వరకర్త లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.