
అందుకోసమే అన్నట్టు.. ప్రశాంత్ నీల్ సినిమా కోసం రావణ రాజ్యంలో అడుగుపెట్టనున్నాడట మన ఎన్టీఆర్. కేజీఎఫ్ 1 అండ్ 2 సినిమాలతో తన పాన్ ఇండియా రేంజ్ యాక్షన్ డైరెక్టర్ గా నామ్ కమాయించిన ప్రశాంత్ నీల్.. ఆ తర్వాత సలార్ సినిమాతో.. సిల్వర్ స్క్రీన్ పై రక్త పాతాన్ని సృష్టించాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేసి.. బ్లాక్ అండ్ వైట్‌లో తారక్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైబ్రేషన్స్ క్రియేట్ చేశాడు. ఇక ఈ వైబ్రేషన్స్ కంటిన్యూ అయ్యేలా ఎన్టీఆర్ – నీల్ సినిమా పేరు డ్రాగన్ అనే టాక్ టాలీవుడ్ నుంచి బయటికి వచ్చింది. వీరి కాంబోలో వస్తున్న సినిమాలో ఏ రేంజ్లో యాక్షన్ ఉండబోతోందో .. అందరికీ అర్థ మయ్యేలా చేసింది. ఇక దీనికి కొనసాగింపుగా.. ఈ మూవీ నుంచి మరొక అప్డేట్ బయటికి వచ్చింది. డ్రాగన్ మూవీ సెకండ్ షెడ్యూల్ రావణ రాజ్యం అదే ఇప్పటి శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనుందని ఓ టాక్ బయటికి వచ్చింది. నిజానికి ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ అయిన ఈ మూవీ షూట్లో ఎన్టీఆర్ పాల్గొనలేదట. నెక్ట్స్ జరగబోయే కొలంబో షూట్లోనూ తారక్ పాల్గొననున్నాడని.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరించనున్నాడని టాక్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కంపెనీ వెబ్సైట్లో ఆత్మ హత్య లేఖ.. తన చావుకు భార్యే కారణం
SSMB29 సినిమా షూటింగ్ పై ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్
Vijay Thalapathy: ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే! దెబ్బకు మైండ్ బ్లాక్ కదూ
శంకర్‌కు బిగ్ రిలీఫ్! ఆయన 11 కోట్ల ఆస్తుల జప్తుకు బ్రేక్
TOP 9 ET News: హనుమంతుడి గాథే… SSMB 29 ?? | రామ్ చరణ్‌తో బాలీవుడ్ ప్రొడ్యూసర్..ధమాకా దార్ ప్లాన్