
మరికొద్ది గంటల్లో అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా.. ఈ ప్రమాణస్వీకారోత్సవంలో అనేక అధికారిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ట్రంప్ వేడుకలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులతో ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం వాషింగ్టన్‌లోని హోటల్స్ అన్ని కూడా దాదాపు 70 శాతం బుక్ అయ్యాయి. ఇక భారత్ నుంచి ప్రధాని మోదీ తరపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ హాజరవుతారు. ఆయన మోదీకి ప్రత్యేక ప్రతినిధిగా ఈ కార్యక్రమంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. అంతేకాకుండా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక లేఖను అందజేయనున్నారు.
మరోవైపు ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ డే , ఫస్ట్ వీక్, హండ్రెస్ డేస్. తాను ఏం చేయబోతున్నానో విందుకు ముందు నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో చెప్పారు ట్రంప్. అమెరికా అధ్యక్ష చరిత్రలో తొలి 100 రోజుల్లోనే కనీవినీ ఎరుగనిరీతిలో అసాధారణ నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారాయన. గొప్ప విజయాన్ని అందించిన ప్రజలను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేస్తామని ట్రంప్ చెప్పారు. బైబిల్ మీద చేసే ప్రమాణంతో ఇది మొదలవుతుందని చెప్పారాయన. ట్యాక్సులు, ధరలు తగ్గిస్తాననీ, జీతాలు పెంచుతానని ట్రంప్ చెప్పారు. వాషింగ్టన్ డీసీలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ డాన్స్ చేశారు. వేదిక మీద డాన్స్ చేస్తున్న ట్రూప్‌తో కలిసి స్టెప్పులు వేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి