
తెగిపడిన కాళ్లు, చేతులు.. జనం ఆహాకారాలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం బీతావహంగా మారింది. తొలి పేలుడు దిల్ సుఖ్ నగర్ వెంకటాద్రి థియేటర్ ముందున్న 107వ నెంబరు బస్‌స్టాప్ వద్ద జరిగింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని మిర్చిపాయింట్ వద్ద రెండో పేలుడు జరిగింది. ఈ రెండు ఘటనలు కేవలం 150 మీటర్ల దూరంలోనే జరిగాయి. తీవ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమంలో మొత్తం 18 మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 130 మంది గాయపడ్డారు. సో.. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 18 మంది ప్రాణాలు బలిగొన్న మానవ మృగాలకు ఉరే సరి అని స్పష్టం చేసింది. 2016లోనే ఎన్ఐఏ కోర్టు దోషులందరికీ ఉరిశిక్ష విధించింది. దాన్ని ధ్రువీకరించేందుకు తీర్పును హైకోర్టుకు నివేదించింది. మరోవైపు ఐదుగురు దోషులు కింది కోర్టును తీర్పును రద్దు చేయాలంటూ అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై దాదాపు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దోషుల అప్పీళ్లను డిస్మిస్ చేసింది. ఇంతకీ ఆ రోజు దిల్ సుఖ్ నగర్ లో ఏం జరిగింది? అక్కడ బాంబు పేలుళ్లు ఎలా చోటుచేసుకున్నాయి? ఈ ఘటనకు సంబంధించి టోటల్ డీటైల్స్ చెప్పడానికి నా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్.. అసలు ఆ రోజు ఏం జరిగింది?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చారిత్రక కట్టడం చార్మినార్ శిధిలమైపోతుందా ??
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్.. కొత్త అప్డేట్ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి