టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం తమ్ముడు. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అలాగే వర్ష బొల్లమ్మ మరో కీలక పాత్రలో ఆకట్టుకోనుంది. ఇక ఈ సినిమాతోనే సుమారు 18 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది అలనాటి హీరోయిన్ లయ. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. జులై 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజి బిజీగా ఉంటోంది. హీరో, హీరోయిన్లు, నిర్మాత అందరూ ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే తమ్ముడు హీరో నితిన్, నిర్మాత దిల్ రాజుతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. భాగంగా దిల్ రాజుకు పలు ప్రశ్నలు సంధించాడు నితిన్. వీటికి దిల్ రాజు కూడా ఆసక్తికర సమాధానాలిచ్చారు.
ఇవి కూడా చదవండి
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ‘ భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే అవకాశముందా? అని నితిన్ ప్రశ్నించారు. అందుకు తగిన కంటెంట్ ఉంటుందా? అని నిర్మాతను అడిగారు. దీనికి దిల్ రాజు ఆసక్తికర సమాధానమిచ్చారు. ‘ ఎందుకు లేదు.. కచ్చితంగా కావాల్సిన కంటెంట్ ఉంటుంది. నేను దాదాపు 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చాను’ అని చెప్పుకొచ్చారు. దీని తర్వాత ఒకవేళ బయోపిక్ తీస్తే హీరోగా ఎవరైతే సెట్ అవుతుందని నితిన్ అడిగారు. దీనికి దిల్ రాజు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘చాలామంది నితిన్ నీ తమ్ముడిలా ఉంటారని చెబుతారు. అది నువ్వు ఒక్కడినే అని నాకు అనిపిస్తోంది’ అని అన్నారు. దీంతో నితిన్ స్మైల్ ఇస్తూ నెక్ట్స్ క్వశ్వ్చన్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
నితిన్- దిల్ రాజు ఇంటర్వ్యూ వీడియో..
#Nithiin: మీ బయోపిక్ తీసే అంత కంటెంట్ మీ లైఫ్ ఉందా ?
Dil Raju: Yea Definite గా ఉంది. pic.twitter.com/ZbDxyfFogS
— Rajesh Manne (@rajeshmanne1) June 30, 2025
నితిన్ తమ్ముడు సినిమా ట్రైలర్..
A powerful promise sparks a fierce battle for survival…! 👪
Presenting the absolutely intense #BangerFromThammudu 🎯🌄
▶️ https://t.co/QX2opY8tyD
In theatres from July 4th, 2025 🔒#ThammuduOnJuly4th @actor_nithiin #SriramVenu @gowda_sapthami #Laya #SaurabhSachdeva… pic.twitter.com/NoSyNMSTlF
— Sri Venkateswara Creations (@SVC_official) June 11, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .
