
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో |గత మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతడి భార్యను విచారించారు. వారి బ్యాంక్ వివరాలను అడిగినట్లు సమాచారం. అయితే గత మూడు రోజులుగా జరుగుతున్నఐటీ సోదాల నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే ఆమెని హాస్పిటిల్కు తీసుకెళ్లారు. వారి వెంట ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి కూడా వెళ్లారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.