
హైదరాబాద్‌లో టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా పుష్ప-2 సినిమా లావాదేవీలపై ఐటీ ఫోకస్ పెట్టింది. పుష్ప-2 సినిమా బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. పుష్ప-2 సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కృష్ణానగర్‌లోని దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దిల్‌రాజు ఇటీవల నిర్మించిన భారీ బడ్జెట్ సినిమాలు, ట్యాక్స్ రిటర్న్స్‌పై అధికారులు ఆరా తీశారు. చెల్లించిన ఆదాయపు పన్నుకు.. వస్తున్న రాబడులకు పొంతన లేకపోవడంపై ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నిన్న దిల్‌రాజు భార్యతో బ్యాంక్ లాకర్లు తెరిపించిన అధికారులు.. ఇవాళ పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలించారు. ఐటీ సోదాలపై నిర్మాత, FDC ఛైర్మన్ దిల్‌రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదని.. ఇండస్ట్రీ మొత్తం ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రేపు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..