

బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్న వారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకే పండ్ల విషయంలో కూడా మధుమేహులు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అయితే, వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ డయాబెటిక్ బాధితులు తినొచ్చా లేదా..? అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. రుచికరమైన పుచ్చకాయ నిండా నీటి శాతం ఎక్కువగా ఉండి సమ్మర్లో శరీరానికి మంచి పోషణ, తక్షణ శక్తిని అందిస్తుంది. మధుమేహులు ఈ పుచ్చకాయ తింటే ఏమౌతుందో ఇక్కడ తెలుసుకుందాం..
పుచ్చకాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పుచ్చకాయలో గ్లైసెమిక్ సూచీ (GI) తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ సూచీ తక్కువగా ఉంటే రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. తాజా పుచ్చకాయ తినవచ్చు కానీ పుచ్చకాయ రసం మధుమేహం ఉన్నవారికి మంచిది కాదు. పుచ్చకాయతో పాటు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.
పుచ్చకాయను తగిన పరిమాణంలో తీసుకుంటే అది మధుమేహంలో కూడా ఎటువంటి హాని కలిగించదు. ఇందులో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఐరన్, కాల్షియం, లైకోపీన్ కూడా ఉన్నాయి. పుచ్చకాయను అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనానికి కూడా తినవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..