
చెరుకు రసంలో అనేక పోషకాలు ఉన్నప్పటికీ, చక్కెర స్థాయి ఎక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది హానికరం. చెరుకులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఇది తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. చెరుకు రసం వంటి పానీయాలు తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారు చెరుకు రసం తాగకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరి నిజంగానే మధుమేహం ఉన్న వాళ్లకి చెరకు రసం మంచిది కాదా. వాళ్లు తాగకూడదా అన్నది వివరంగా తెలుసుకుందాం.
చెరకులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.. దీంతో పాటు కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అయితే వీటితో ఎలాంటి సమస్య లేకపోయినా ఇందులో ఉండే నేచురల్ షుగర్ మాత్రం డయాబిటెక్ పేషెంట్లు మాత్రం చెరుకు రసం తాగాలంటే భయపడుతుంటారు. కానీ, డయాబెటిస్ ఉన్న వాళ్లు చెరకు రసం తాగే విషయంలో జాగ్రత్తగా ఉంటే తగిన మోతాదులో తీసుకోవచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఒక ఫుల్ గ్లాస్ అంత చెరుకు రసం తాగకుండా కాస్తంత తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కాస్తంత కంట్రోల్ లో ఉంటాయి. ఒకేసారి గ్లాసెడు రసం తాగేస్తే ఆ ఎఫెక్ట్ వెంటనే చూపిస్తుంది. ఆ సమయంలో కళ్లు తిరగడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అనారోగ్యకరమైన ఆకలితో ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
చెరకు రసం తాగినప్పుడు అందులోని సుక్రోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందుకే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అయితే ఈ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలంటే చెరకు రసంతో పాటు ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చెరకు రసం తాగిన వెంటనే గుప్పెడు నట్స్ తినాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో సుక్రోజ్ ఎక్కువ మొత్తంలో కరగకుండా ఉంటుందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..