
రోజురోజుకు ఆడవాళ్ల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. రోజు ఎక్కడో అక్కడ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేయడం, అత్తమామను చంపడం, కొందరైనే ఏకంగా కడుపున పుట్టిన పిల్లలనే హత్య చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల ఢిల్లీలో ఓ మైనర్ బాలుడి మర్డర్ జరిగింది. అయితే ఢిల్లీకి చెందిన ఓ లేడీ డాన్ కనుసన్నల్లోనే ఈ మర్డర్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో కేసుపై విచారణ జరిపిన పోలీసులు లేడీ డానే ఆ బాలుడిని హత్య చేయించినట్టు గుర్తించారు. దీంతో శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అలసు ఈ లేడీ డాన్ ఎవరూ, ఆమె మైనర్ బాలుడిని ఎందుకు చంపాల్సి వచ్చింది. తెలుసుకుందాం పదండి.
జిక్రా ఈమె ఓ బౌన్సర్.. ఈమె ఈశాన్య ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఢిల్లీ లోకల్ గ్యాంగ్‌స్టర్ అయినా హషీమ్ బాబా భార్య జోయ దగ్గర ఈ జిక్రా బౌన్సర్‌గా పని చేసేది. అమె పనిచేసేది ఒక గ్యాంగ్‌స్టర్ భార్యతో కాబట్టి ఈమె కూడా వాళ్లలా కావాలనుకుంది. అక్కడ ఉండే గన్స్‌తో రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసేది. దీంతో ఒకసారి జైలుకు కూడా వెళ్లొచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈమెకు కూడా హషీమ్ బాబాలా గ్యాంగ్‌స్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది. దీంతో తనకు తానే లేడీ డాన్‌గా ప్రకటించుకుంది. వాళ్లతో కలిసి పనిచేయాలనుకుంది. అయితే హసీమ్ బాబా ఓ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ లేడీ డాన్ రెచ్చిపోయింది. తానే ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. 10 నుంచి 12 మంది యువకులతో ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంది. జోయా ద్వారా హషీమ్ బాబాకు దగ్గరవ్వాలని, ఆమె డ్రగ్స్ వ్యాపారంలో కూడా పాల్గొనాలని ఈమె కోరుకుంది. అయితే, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడంలో ఆమెకు సహాయం చేసిన జోయా అరెస్టు తర్వాత ఆమె ప్రణాళికలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది.
ఢిల్లీకి చెందిన కునాల్ సింగ్ అనే బాలుడికి, లేడీ డాన్ అయిన జిక్రా సోదరుడితో కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంలో కొన్నాళ్ల క్రితం, కునాల్ వర్గానికి చెందిన కొంతమంది సభ్యులు జిక్రా సోదరుడు సాహిల్‌పై దాడి చేశారని, దీనితో కునాల్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తన సోదరుడిపై దాడి చేసిన కునాల్ సింగ్‌పై పగ పెంచుకున్న లేడీ డాన్.. అతని హత్యకు ప్లాన్ చేసింది. తనను చంపేస్తానని ఏకంగా కునాల్ సింగ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చింది. అనుకున్నట్టే అతని ఇంటి వద్ద ఓ గ్యాంగ్‌ను పెట్టింది. గురువారం రాత్రి పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన కునాల్‌ను జిక్రా గ్యాంగ్ పట్టుకుంది. కునాల్‌పై కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. గమనించిన స్థానికులు కునాల్‌ను స్థానిక హాస్పిట్లకు తరలించగా..కునాల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. జిక్రా ప్లాన్ ప్రకారమే ఈ హత్య జరిగినట్టు విచారణలో తేలడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…