
ఐపీఎల్ 2025లో సూపర్ థ్రిల్లర్స్ వీక్ నడుస్తున్నట్లు ఉంది. పంజాబ్ కేకేఆర్ మధ్య జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ చివరి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగింది. తాజాగా బుధవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అయితే.. ఏకంగా ఇన్నింగ్స్ చివరి బాల్‌కు టై అయి.. సూపర్ వరకు దారి తీసింది. ఈ సూపర్ థ్రిల్లర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వినోదాన్ని అందించింది. మొత్తం ఓడిపోతుందనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి.. సూపర్ ఓవర్లో గెలిచింది. కచ్చితంగా గెలుస్తుందని అనుకున్న రాజస్థాన్ చేచేతులా మ్యాచ్‌ను ఢిల్లీకి అప్పగించింది. అయితే.. ఢిల్లీ పేసర్ మిచెల్ స్టార్క్ సూపర్ బౌలింగ్‌తో మ్యాచ్ చివరి ఓవర్లో 9 పరుగులు డిఫెండ్ చేయడంతో పాటు.. సూపర్ ఓవర్లో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. ఢిల్లీకి విజయాన్ని అందించాడు.
కాగా, మ్యాచ్ సూపర్ ఓవర్ టైమ్ రాజస్థాన్ రాయల్స్ ఓటమికి వాళ్ల సొంత తప్పిదం కూడా కారణం అయింది. మ్యాచ్ టై అయిన తర్వాత.. సూపర్ ఓవర్ కోసం హెట్మేయర్తో పాటు రియాన్ పరాగ్‌ను పంపించింది. నిజానికి హెట్మేయర్ అంతకుముందే.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రన్స్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. స్టార్క్ వేసే యార్కర్లకు సింగిల్స్ మాత్రమే తియగలిగాడు. అలాంటి బ్యాటర్‌ను మళ్లీ స్టార్క్ బౌలింగ్‌లో సూపర్ ఓవర్ ఆడేందుకు పంపడం బ్లండర్ మిస్టేక్. అతని ప్లేస్‌లో మ్యాచ్‌లో సూపర్‌గా ఆడుతూ.. బాల్ అద్బుతంగా టైమ్ చేస్తున్న నితీష్ రాణాను పంపింతే ఫలితం బాగుండేది. ఎందుకంటే.. స్టార్క్ యార్కర్లను డీప్ ఇన్ ది క్రీజ్ ఉంటూ.. ఓవర్ ది కవర్స్ షాట్లను రానా బాగా ఆడే వాడు. కానీ, టీమ్‌లో చాలా చర్చ జరిగిన తర్వాత హెట్మేయర్, పరాగ్‌ను పంపారు.
పోని ఒక వికెట్ పడిన తర్వాత అయినా రానాను పంపారా అంటూ అది లేదు.. యశస్వి జైస్వాల్‌ను పంపారు. అప్పటికే రన్స్ రావట్లేదని తీవ్ర ఒత్తిడిలో ఉన్న హెట్మేయర్.. వాళ్లిద్దరిని రనౌట్ చేశాడు. తొలి రనౌట్‌లో పూర్తిగా హెట్మేయర్దే తప్పు. ఎందుకంటే.. అంతకు ముందు బాల్‌ను పరాగ్ ఫోర్ కొట్టాడు. పైగా అది నో బాల్. ఎక్స్ బాల్ ఉంది. సో.. స్ట్రైక్ పరాగ్ వద్ద ఉన్న ఇబ్బంది ఉండేది కాదు. కానీ, లేని రన్ కోసం వెళ్లి పరాగ్‌ను రనౌట్ చేశాడు. ఇక చేసేది ఏం లేక.. పరాగ్ తన వికెట్‌ను హెట్మేయర్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. మొత్తం రెండు బౌండరీలు, ఒక నో బాల్ వచ్చిన సూపర్ ఓవర్లో రాజస్థాన్ కేవలం 11 రన్స్ మాత్రమే చేయగలిగింది అంటే కచ్చితంగా హెట్మేయర్ను సూపర్ ఓవర్లో ఆడించడమే కారణం. అయితే.. ఈ నిర్ణయం హెడ్ కోచ్ ద్రవిడ్ తీసుకొని ఉంటాడాని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి