
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇందులో డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన డేవిడ్ వార్నర్ తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ మై డాక్టర్ డైరెక్టర్ రఘునందన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మై డాక్టర్ అంతర్జాతీయ క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం రాబోయే యాక్షన్ థ్రిల్లర్ రాబిన్ హుడ్ చిత్రంతో కలిసి మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు, ఇండియన్ OTC రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తోంది.
ఇది భారతదేశంలో ఓ విశిష్టమైన భాగస్వామ్యం. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టార్ తో కలిసి పనిచేయడం గర్వకారణంగా ఉందని.. డేవిడ్ వార్నర్ మాతో చేరడం వలన బ్రాండ్ కు ఎనర్జీ, విజిబిలిటీ రెండూ గణనీయంగా పెరుగుతాయని నమ్మకం ఉందని మై డాక్టర్ డైరెక్టర్ రఘునందన్ తెలిపారు.
మై డాక్టర్ బ్రాండ్ తన విస్తృత శ్రేణి ఉత్పత్తులతో పెయిన్ రిలీఫ్ ఆయిల్, క్రీమ్, స్ప్రే, ప్యాచ్లు, ఇతర ఫార్ములేషన్లు అనేక కుటుంబాల్లో నమ్మకాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు వార్నర్, రాబిన్ హుడ్ మూవీ క్రేజ్ తో, ఈ బ్రాండ్ మరింత ప్రజల హృదయాల్లోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..