

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రాబిన్ హుడ్. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేయగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 28న థియేటర్లలో విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. మరోవైపు సినిమా టీంతో కలిసి ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు వార్నర్. నితిన్, శ్రీలీల కలిసి పలు ఇంటర్వ్యూలలోనూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు డేవిడ్ వార్నర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఈ సినిమాలో వార్నర్ కేవలం 2 నిమిషాల 50 సెకండ్స్ నిడివి ఉన్న పాత్రలో కనిపించనున్నారు. కానీ ఇందుకోసం ఆయన ఏకంగా రూ.2.25 కోట్లు అంటే నిమిషానికి ఒక కోటి పారితోషికం తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
#DavidWarner Cameo in #Robinhood
Duration – 2 Min 50 Seconds
Remuneration – 2.5 Crores
Shoot days – 2 daysOne of the costly cameos in Indian Cinema, Took 1.25CR for each day pic.twitter.com/lzZadGhGmy
— Daily Culture (@DailyCultureYT) March 26, 2025
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..