
నటుడు దర్శన్ కుంటిసాకులు చెబుతూ కోర్టు విచారణను తప్పించుకు తిరుగుతున్నారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కోర్టు విచారణకు హాజరుకాకుండా ఆయన చేసిన ఘనకార్యం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో A1గా ఉన్నారు నటుడు దర్శన్. గతంలోనే ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే కోర్టు విచారణకు హాజరుకాకుండా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వివాదాస్పదంగా మారింది. నడుంనొప్పితో విచారణ ఎగ్గొట్టిన ఆయన సినిమా కార్యక్రమాల్లో పాల్గొనడం రచ్చ అవుతోంది. రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి ఇటీవల కోర్టులో విచారణ జరిగింది. దీనికి దర్శన్ గైర్హాజరు అయ్యారు. నడుంనొప్పి కారణంగానే విచారణకు హాజరు కాలేకపోయారని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
దర్శన్ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసు విచారణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో ఉండాలని.. ఇలాంటి సాకులు చెప్పి హాజరుకాకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే దర్శన్ ‘వామన’ చిత్రం స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరుకావడం షాక్‌కు గురిచేసింది. బెంగళూరులోని ఒక ప్రముఖ థియేటర్లో జరిగిన ఈ స్క్రీనింగ్‌లో ఇతర చిత్రబృందంతో కలిసి ఆయన పాల్గొన్నారు.
సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన కొన్ని విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడతోపాటు పలువురు నిందితులు కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. డిసెంబరులో వీరికి బెయిల్ మంజూరు అయింది.
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?