
కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉండే కరివేపాకు శరీరానికి శక్తిని అందిస్తుంది. జీవక్రియను పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును తీసుకుంటే మీరు ఊహించని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తుంది. బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇంకా మరెన్నో లాభాలు ఉన్నాయి. అవేంటంటే…
కరివేపాకులో ఎ, బి, సి, ఇ లు సమృద్ధిగా నిండి ఉంటాయి. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, డైటరీ ఫైబర్ కూడా ఉన్నాయి. ఇది బరువు నిర్వహణ, కొవ్వు తగ్గడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీటిని కూడా తయారు చేసుకుని తాగొచ్చు. ఇది శరీర ఆరోగ్యంతో పాటు అందమైన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. కరివేపాకు నీరు తాగడం వల్ల మీ కండరాలు, నరాలకు ఉపశమనం కలుగుతుంది. ఇది మీ శరీరానికి, మనస్సుకు శాంతిని ఇస్తుంది. ఇది ఒత్తిడితో పోరాడటానికి సహాయపడుతుంది. మీరు ఈ డిటాక్స్ డ్రింక్‌తో మీ రోజును ప్రారంభించినట్లయితే, మీరు రోజంతా ప్రశాంతంగా, రిఫ్రెష్‌గా ఉంటారు.
కరివేపాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు టానిక్‌గా పనిచేస్తాయి. ఇది హెయిర్ ఫోలికల్స్ ను దృఢంగా చేయడంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది స్కాల్ప్‌కి పోషణనిచ్చి జుట్టును మెరిసేలా చేస్తుంది. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంలో వృద్ధాప్యాన్ని వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది.
ఇవి కూడా చదవండి
ఇకపోతే, కరివేపాకు నీటిని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు నీటిలో నాలుగైదు కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించాలి. కొన్ని నిమిషాలు ఉడిన తరువాత స్టౌవ్ కట్టేసి నీటిని ఫిల్టర్ చేసుకోవాలి. దీనికి తేనె, నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుని తాగేయండి. ఈ పవర్పుట్ డ్రింక్ మీరు బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వును కరిగించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..