
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమిని చవిచూసిన తర్వాత, CSK కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక జర్నలిస్ట్‌పై తీవ్రంగా స్పందించాడు. ఈ మ్యాచులో CSK 50 పరుగుల తేడాతో ఓడిపోయింది, 2008 తర్వాత చెపాక్ మైదానంలో RCB సాధించిన తొలి విజయం ఇది. ఈ ఓటమితో CSKకి ఈ సీజన్లో ఇది తొలి పరాజయం.
జర్నలిస్టుతో ఫ్లెమింగ్ మాటల యుద్ధం
విలేకరుల సమావేశంలో జర్నలిస్టుతో జరిపిన సంభాషణ ఇలా సాగింది:
మొదటి మ్యాచ్‌లో, మీరు దాదాపు 20 ఓవర్లలో 156 పరుగులు ఛేదించారు. ఈరోజు 146 పరుగులు మాత్రమే చేశారు. ఇది మీ క్రికెట్ ఆడే విధానం అని నాకు తెలుసు, కానీ ఇది కొంతవరకు పాతబడిపోయిందని మీరు అనుకుంటున్నారా? అని ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. దీనికి బదులుగా ఫ్లెమింగ్ మీరు నా ఆట తీరు గురించి ఏమి చెప్పాలని చూస్తున్నారు? మాకు ఫైర్ పవర్ లేనట్టుగా మీరు మాట్లాడుతున్నారు. కానీ మాకు అన్ని రకాల ఫైర్ పవర్ ఉంది. మీ ప్రశ్నకు నాకు అర్థం కావడం లేదు. క్రికెట్లో గెలుపోటములు సహజం. మనం మొదటి బంతి నుంచే దూకుడు ఆట ఆడకపోవడం వల్ల కొంత అదృష్టం మన దారిలోకి రాలేదని మాత్రమే చెప్పగలను. కానీ మేము క్రికెట్ యొక్క సానుకూల బ్రాండ్‌ను ఆడుతున్నాం. మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి! అని వార్నింగ్ ఇచ్చాడు.
దీనికి జర్నలిస్టు నేను నిన్ను తక్కువ అంచనా వేయడం లేదు అని చెప్పుకొచ్చినా, నువ్వు ఒక విధంగా అదే చేసావు. ఇది ఒక తెలివితక్కువ ప్రశ్న అని ఫ్లెమింగ్ మండిపడ్డారు. ఈ మాటల యుద్ధంతో విలేకరుల సమావేశం హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెమింగ్ CSK శైలి పాతదైపోయిందనే విమర్శను తిప్పికొట్టాడు.
CSK చెపాక్ మైదానంలో హోమ్ అడ్వాంటేజ్ ఉందని చాలా మంది భావిస్తారు, కానీ ఫ్లెమింగ్ దాన్ని పూర్తిగా ఖండించాడు. చెపాక్ మైదానంలో హోమ్ అడ్వాంటేజ్ ఉండదని మేము చాలా సంవత్సరాలుగా చెబుతున్నాం. మేము రెండుసార్లు ఇతర మైదానాల్లో గెలిచాం, కానీ ఇక్కడ తగిన విధంగా ప్రదర్శించలేకపోతున్నాం. గత రెండు సంవత్సరాలుగా మేము వికెట్లను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది పాత చెపాక్ కాదు. ఇక్కడ నలుగురు స్పిన్నర్లను ఆడించలేం. ప్రతి మ్యాచ్‌లో పిచ్ స్వభావం మారుతూ ఉంది, అందుకే మేము గెలవడానికి కొంత కష్టపడుతున్నాం. అని అన్నారు.
ఫ్లెమింగ్ వ్యాఖ్యలు చూస్తే CSK తమ హోమ్ గ్రౌండ్‌పై తగిన విధంగా ఆడలేకపోతున్నదనే విషయం స్పష్టమవుతోంది. CSK ఈ ఓటమిని అధిగమించి తిరిగి బలంగా ఆడుతుందా? ఫ్లెమింగ్ తన జట్టు ఆటతీరులో మార్పులు చేస్తాడా? ఇది చూడాల్సిన విషయం!
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..