
క్రెడిట్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ అర్హతను ప్రతిబింబించే మూడు అంకెల సంఖ్య, ఇది సకాలంలో క్రెడిట్ తిరిగి చెల్లించే అవకాశాన్ని సూచిస్తుంది. 300 నుంచి 900 వరకు ఈ స్కోర్ ఉంటుంది. అధిక స్కోరు బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను సూచిస్తుంది. అధిక స్కోరుతో వ్యక్తులు తక్కువ వడ్డీ రేట్లతో అనుకూలమైన నిబంధనలపై రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి క్రెడిట్ ప్రవర్తనతో పాటు బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణను ప్రదర్శిస్తుంది. ఈ స్కోరు ఒక వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ సమాచారం మొత్తం విస్తృతమైన విశ్లేషణ ద్వారా బలమైన డేటా, మరియు అల్గారిథమ్‌లను ఉపయోగించి రూపొందిస్తారు. భారతదేశంలో వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌ను అందించడానికి ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫ్యాక్స్, సీఆర్ఐఎఫ్ హై మార్క్‌లకు అనుమతి ఉంది.
క్రెడిట్ స్కోర్ మెరుగుపర్చుకోవడం ఇలా
- క్రెడిట్ హిస్టరీ లేని వ్యక్తులకు స్థిర డిపాజిట్ లేదా చిన్న రుణం పూచీకత్తుగా అవసరమయ్యే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డు ద్వారా బలమైన క్రెడిట్ స్కోర్ పొందవచ్చు. తక్కువ నిల్వలను నిర్వహించడంతో సకాలంలో తిరిగి చెల్లింపులు చేయడం ద్వారా బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడు ఇవి సానుకూల క్రెడిట్‌ను స్థాపించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
- నిరంతర ఆర్థిక క్రమశిక్షణ ద్వారా తక్కువ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నాు. తక్కువ స్కోరుకు మూలకారణాన్ని గుర్తించడం మొదటి దశ అని, మిస్డ్ పేమెంట్స్, గతంలో జరిగిన డిఫాల్ట్‌ల వల్ల క్రెడిట్ హిస్టరీ తగ్గుతుంది. అనంతరం తిరిగి చెల్లింపు ప్రవర్తనను మెరుగుపరచడం, బకాయి ఉన్న మొత్తాలను తగ్గించడంతో అధిక క్రెడిట్ వినియోగాన్ని నివారించడం అనేవి కీలక దశలుగా ఉంటాయి. ఇలా చేయడం ద్వారా క్రెడిట్ హిస్టరీ పెరుగుతుంది.
క్రెడిట్ నివేదికలను పర్యవేక్షించడం
క్రెడిట్ హిస్టరీ పురోగతిని పర్యవేక్షించడానికి ఏవైనా వ్యత్యాసాలు లేదా అనధికార కార్యకలాపాలను గుర్తించి సరిదిద్దడానికి క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా సమీక్షించడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. స్థిరమైన ప్రయత్నం, సమాచారంతో కూడిన ఆర్థిక పద్ధతులతో, వ్యక్తులు బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించుకోవచ్చు. అలాగే అధికారిక క్రెడిట్‌కు వారి ప్రాప్యతను పెంచుకోవచ్చు.
క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు
- రుణం, క్రెడిట్ కార్డ్ చెల్లింపులను సకాలంలో చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఆలస్యం లేదా తప్పిపోయిన చెల్లింపులు ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
- గృహ లేదా ఆటో లోన్, క్రెడిట్ కార్డ్ వంటి సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల సమతుల్య మిశ్రమాన్ని నిర్వహించడం వల్ల వివిధ రకాల రుణాలను బాధ్యతాయుతంగా నిర్వహించగలరని, తెలివైన ఆర్థిక ఎంపికలు చేసుకోవచ్చు.
- దీర్ఘకాలిక క్రెడిట్ హిస్టరీ రుణదాతలతో నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అయితే తరచుగా తక్కువ వ్యవధిలో కొత్త క్రెడిట్ తీసుకోవడం సమస్యలను కలిగిస్తుంది. అలాగే స్కోరును ప్రభావితం చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి