
ఇప్పటి వరకూ ఒక్కసారి ఉపయోగించిన వంటనూనెను పదే పదే ఉపయోగించవద్దని.. ఇలా మళ్ళీ మళ్ళీ నూనెను వేడి చేయడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరించేవారు. అయితే ఇప్పుడు అసలు వంటలకు నూనె ను ఉపయోగించవద్దని.. వీటిల్లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతున్నాయని వీల్ కార్నెల్ మెడిసిన్ పరిశోధకుల బృందం సంచలన విషయాలు వెల్లడించింది. తాము చేసిన పరిశోధనలో వంట నూనెలు, కూరగాయల నూనెలను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని తేలినట్లు ఈ బృందం ప్రకటించింది. ఈ వంట నూనెల్లో ఉండే లినోలెయిక్ కేన్సర్ కణాల పెరుగుదలకు కారకం అని ముఖ్యంగా రొమ్మ కేన్సర్ లోని కణాల్లో పెరుగుదకు కారణం అవుతున్నాయని తెలిపింది.
ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్
ఈ పరిశోధన ప్రకారం లినోలెయిక్ యాసిడ్ ఎఫ్‌ఏబీపీ5 అనే ఒక నిర్దిష్ట ప్రోటీన్‌తో కలిసి అత్యంత ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ కణాల పెరుగుదలను వేగవంతం చేస్తుందట. ఈ ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ అనేది చికిత్సకు కష్టతరమైన, వేగంగా వ్యాప్తి చెందే రకమైన క్యాన్సర్. అంటే ఇది సాధారణ బ్రెస్ట్ క్యాన్సర్ (90%) తో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందడానికి.. తక్కువ జీవిత కాలాన్ని (77%) కలిగి ఉన్న క్యాన్సర్. ఈ నేపథ్యంలో బృందం వెల్లడించిన విషయాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
వంట నూనెల్లోని ఒమేగా 6 కొవ్వు ఆమ్లం
మనం రోజూ ఉపయోగిస్తున్న వంట నూనెలు.. ముఖ్యంగా సోయాబీన్, కుసుమ నూనె వంటి సీడ్స్ ఆయిల్స్, పందిమాంసం, గుడ్లు వంటి జంతువుల్లో కనిపించే ఒమేగా 6 కొవ్వు ఆమ్లం లినోలెయిక్.. చికిత్స చేయడానికే కష్టతరమైన ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము కేన్సర్ పెరుగదలకు కారణం అవుతుందని తమ పరిశోధనలో గుర్తించామని అంటున్నారు నిపుణులు. తమ పరిశోధనలో ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టంగా తెలిసినట్లు చెప్పారు. అంతేకాదు తమ పరిశోధనన ఈ క్యాన్సర్ వ్యాధిని అర్థం చేసుకోవడానికి.. సరి కొత్త చికిత్స విధానానికి,. కొత్త ఔషధాల అభివృద్ధికి సహాయపడుతుందని పరిశోధకులు చెప్పారు.
ఇవి కూడా చదవండి
సరికొత్త చికిత్సా విధానంవైపు ఆలోచన
తమ పరిశోధన ఆహార కొవ్వులు, కేన్సర్ మధ్య సంబంధాన్ని వివరించడంలో సహాయపడడమే కాదు అవసరమైన యిన పోషక హారం, ఏ రోగులకు ఎక్కువ ప్రయోజనం అనే విషయాలను స్పష్టంగా నిర్వచించగలమని అధ్యయన సీనియర్ రచయిత , అన్నా-మరియా , స్టీఫెన్ కెల్లెన్, ఫార్మకాలజీ విభాగంలో క్యాన్సర్ పరిశోధన ప్రొఫెసర్ .. వీల్ కార్నెల్ మెడిసిన్‌లోని సాండ్రా, ఎడ్వర్డ్ మేయర్ క్యాన్సర్ సెంటర్ సభ్యుడు డాక్టర్ జాన్ బ్లెనిస్ చెబుతున్నారు.
తాజా పరిశోధనలు వంట నూనెలు కూడా ముఖ్యంగా ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ను పెంచే ప్రమాదం పెంచుతుందని ప్రకటించడంతో ఏమి కొనాలి ఏమి తినాలి అంటూ సాధారణ ప్రజలు భయపడుతున్నారని చెప్పవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..