
సాధారణంగా ఉండేవి ఏడు రంగులే అయినా.. వాటి నుంచి ఎన్నో కొత్త రకాల రంగుల్ని సృష్టించారు. మన చుట్టు పక్కల ఎన్నో రంగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రంగు అంటే చాలా ఇష్టం. ఇలా వారికి ఇష్టమైన రంగుల్ని బట్టి.. వారి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవచ్చని పరిశోధికులు అంటున్నారు.
ఎక్కువగా చాలా మందికి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. నలుపు రంగును ఎక్కువగా ఇష్టపడేవారు ఎక్కువగా నిరాశకు గురవుతూ ఉంటారు. వీరు ఎక్కువగా స్వేచ్ఛగా ఉండేందుకు ఇష్ట పడతారు. పర్పుల్ కలర్ అంటే వంకాయ కలర్‌ని ఇష్టపడేవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరిలో రాజసం లక్షణాలు కనిపిస్తాయి.
తెలుపు రంగును ఇష్ట పడేవారి సంఖ్య కూడా ఎక్కువే. వైట్ కలర్‌ని ఇష్టపడేవారు ఎక్కువగా అమాయకత్వంగా ఉంటారు. వీరికి దైవ భక్తి ఎక్కువ. ఏ విషయంలో అయినా క్రమ శిక్షణగా ఉంటారు. ఎరుపు రంగును ఇష్టపడేవారికి కోపం, ప్రేమ రెండూ ఎక్కువే. వీళ్లు రెబల్‌గా, యాక్టీవ్‌గా ఉంటారు.
పింక్‌లో చాలా రకాలు ఉంటారు. ఈ రంగును ఎక్కువగా ప్రేమకు గుర్తుగా వాడతారు. పింక్ కలర్‌ని ఇష్టపడేవారు స్వచ్ఛంగా, రొమాంటిక్‌గా ఉంటారు. నారింజ రంగును ఇష్టపడేవారు.. అన్నింట్లో యాక్టీవ్‌గా ఉంటారు. నీలం రంగును ఇష్టపడేవారు ప్రశాంతంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు.
ఎక్కువగా ఆకు పచ్చ రంగు అన్నా చాలా మందికి ఇష్టం. ఆకు పచ్చ అంటే ప్రకృతికి చిహ్నం. ఈ కలర్‌ని ఇష్టపడేవారు అసూయ, దురాశ గుణాలు ఎక్కువగా ఉంటారు. వీరిలో మరికొంత మంది అంకిత భావంతో ఉంటారు. పసుపు కలర్‌ని ఇష్టపడేవారు ఆనందంగా, యాక్టీవ్‌గా ఉంటారు.