కొంతమందికి కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీకు కొబ్బరి నీళ్ల వల్ల అలెర్జీ ఉంటే, త్వరగా గ్రహించి వాటికి దూరంగా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు.
