
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య లాంటి హిట్ తర్వాత చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అభిమానులంతా విశ్వంభర సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ సైతం కనిపించనుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ట.
కాగా ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అవ్వడంతో పాటు 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత అనిల్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా ఓ స్టార్ హీరో భార్య నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అదితిరావు హైదరి. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సమ్మోహనం, మహాసముద్రం లాంటి సినిమాలతో పాపులర్ అయ్యింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇక హీరో సిద్దార్థ్ ను ఈ భామ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇద్దరికీ ఇది రెండో వివాహమే.. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఆమెతో పాటు పలువురు ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..