
చిన్న వయసు పిల్లలకు కృత్రిమ స్వీటనర్లు ఉన్న డ్రింక్స్ ఇవ్వకూడదని యూకే నిపుణులు హెచ్చిరిస్తున్నారు. సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆన్ న్యూట్రిషన్ (ఎస్ఏఈఎన్) తాజా సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్పర్టేమ్, స్టీవియా, సాకరిన్, సుక్రలోస్ వంటి పదార్థాలతో తయారైన షుగర్-ఫ్రీ వంటి పదార్థాలను పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లో అందించరాదని వారు చెప్తున్నారు. వీటికి బదులుగా వారిని తగినన్ని మంచి నీటిని తాగే అలవాటు చేయాలి. ఈ స్వీట్ నర్లు కలిసిన డ్రింక్స్ కారణంగా పిల్లలు భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారని చిన్నవయసులోనే వారి ఆయుష్షును హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కృత్రిమ స్వీటనర్లు అంటే ఏమిటి?
ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల దంత క్షయం, టైప్-2 డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. అందుకే తక్కువ లేదా మొత్తానికే చక్కర కేలరీలతో తీపి రుచిని అందించే కృత్రిమ స్వీటనర్లు అభివృద్ధి చేయబడ్డాయి. యూకేలో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఈ స్వీటనర్లన్నీ కఠిన భద్రతా పరీక్షలను ఆమోదించినవే. అయినప్పటికీ, పిల్లల్లో వీటి వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని ఒకసారి వీటికి అలవాటు పడితే తీపి రుచిని మాన్పించడం కష్టమని చెప్తున్నారు.
ఇన్సులిన్ స్థాయిలను పెంచేస్తున్నాయి..
పంచదారకంటే ఎక్కువ అతిగా ఉండే ఈ కృత్రిమ స్వీటనర్లు తియ్యగా ఉంటాయి. ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాలను మరింత తినాలనిపించేలా ఇవి మెదడును ప్రభావితం చేస్తాయి. దీంతో అతి బరువు తగ్గడం కాదు పెరుగుతుంది. అలాగే మనం ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ తీసుకున్నప్పుడు.. మనం తీపి పదార్థం తింటున్నామని, మెదడుకు సిగ్నల్స్ వెళ్తాయి. వెంటనే మన మెదడు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే ఇన్సులిన్‌ను విడుదల చేయడానికి సూచనలు ఇస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు తీసుకుంటే.. మన ప్యాంక్రియా నుంచి ఇన్సిలన్ విడుదల అవుతుంది. ఇది రక్తంలో ఇన్సులన్ స్థాయిలను పెంచుతుంది.
ఎస్ఏఈఎన్ ఏం చెబుతోంది?
చక్కరకు బదులుగా తీసుకునే ఈ స్వీటనర్లు ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించవని చెప్పడానికి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని ఎస్ఏఈఎన్ తెలిపింది. అయితే, వీటి వల్ల చక్కెర వాడకం తగ్గించడం మంచి పరిణామమే. తక్కువ కాలంలో బరువు తగ్గడానికి స్వీటనర్లు ఉపయోగపడవచ్చు, కానీ, బరువు తగ్గడానికి ఇదొక్కటే మంచి మార్గం కాదని నిపుణులు చెప్తున్నారు. ఈ స్వీట్ నర్ల విషయంలో మరిన్ని పరిశోధనలు జరిపాల్సిన అవసరం ఉందని అప్పటివరకు వీటి వాడకాన్ని మితంగా ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
క్యాన్సర్ ముప్పు 95 శాతం..
ఆర్టిఫిషియల్ స్వీట్ పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారికి.. క్యాన్సర్ వచ్చే అవకాశం 95% ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పిల్లలకు వీటితో కూడిన బేకరీ ఫుడ్స్, డ్రింక్స్ ఇవ్వడం మరింత ప్రమాదం. అలాగే కృత్రిమ స్వీటనర్లు మన పేగుల ఆరోగ్యంపై దుష్ప్రభావాలను చూపిస్తాయి. పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు గ్లూకోజ్‌ని ఎక్కువగా తీసుకోలేనట్లుగా మార్చేస్తాయి. అందువల్ల గ్లూకోజ్‌ను అంగీకరించలేకపోవటం, ఊబకాయం లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే గ్యాస్ సంబంధిత సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. నిజానికి కృత్రిమ తీపి పదార్థాలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలను ఎప్పటికీ భర్తీ చేయలేవు. అందుకే తక్కువ క్యాలరీలు ఉన్న తీపి పదార్థాల కోసం సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు.