
మోడలింగ్ రంగం నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి రాణించిన నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే విదేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టి ఇక్కడ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ పేరు ప్రఖ్యాతలు సాధించిన నటీనటులు ఎందఱో ఉన్నారు. కానీ వీరిలో ముందుగా గుర్తుకొచ్చే పేరు కత్రినా కైఫ్. తండ్రి కశ్మీరీ..తల్లిది బ్రిటన్. అంటే మొహ్మద్ కైఫ్ కాశ్మీర్ లో జన్మించిన బ్రిటిష్ వ్యాపారవేత్త. తల్లి సుసన్నే కైఫ్. కత్రినాకు ఏడుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ళు. బ్రిటిష్ హాంగ్ కాంగ్ లో కత్రినా పుట్టింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో దేశాలకు తిరిగిన కత్రినా.. మొదట మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది.
మోడల్‌గా కింగ్ ఫిషర్ క్యాలెండర్లో కనిపించిన కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో బూమ్ సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తెలుగులో వెంకటేష్ సరసర మల్లీశ్వరి సినిమాలో నటించింది. తర్వాత మైనే ప్యార్ క్యూ కియా, నమస్తే లండన్ వంటి సినిమాలతో హిట్ అందుకుంది. కానీ నటనకు మాత్రం విమర్శలు వచ్చాయి. న్యూయార్క్ సినిమాలో కత్రినా నటనకు మొదటిసారిగా ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి
విమర్శలకు ప్రశంసలకు అతీతంగా వరసగా సినిమాలను చేస్తూ కెరీర్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కమర్షియల్ గా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూనే ఐటెం సాంగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తన తల్లితో కలసి ఎన్నో దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అందుకోసం స్టేజ్ షోలు కూడా చేస్తారు.
సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ తో ప్రేమాయణం అంటూ పుకార్లు షికారు చేసేవి. అయితే కత్రినా డిసెంబర్ 9, 2021న విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది. హిందూ సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుంది. విక్కీ కౌశల్ ఇప్పుడిప్పుడే స్టార్ హీరో దిశగా అడుగులు వేస్తున్నాడు. చావా సినిమాతో యావత్ భారతాన్ని తనవైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..