
మీరు ఆరోగ్యకరమైన అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే, చియా విత్తనాలను యాడ్ చేసుకుని స్మూతీ తాగడం బెస్ట్. అరటిపండు, బెర్రీలు, ఓట్స్, గింజలు, పెరుగు లేదా పాలతో ఆరోగ్యకరమైన స్మూతీని తయారు చేసి, దానికి ఒక చెంచా చియా విత్తనాలను కలుపుకోండి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా, మిమ్మల్ని చాలా సేపు కడుపు నిండినట్లు చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.