చెఫ్ టోపీ కేవలం సంప్రదాయం, ఫ్యాషన్‌కే పరిమితం కాదు. వంట ప్రక్రియలో భద్రత, పరిశుభ్రతను కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వంటగది పరిశుభ్రత కారణాల వల్ల చెఫ్‌లు ఈ పొడవాటి తెల్లటి టోపీలను ధరిస్తారు. ఇది జుట్టు ఆహారంలోకి పడకుండా నిరోధిస్తుంది. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి వీలు కల్పిస్తుంది. మరోకారణం ఏంటంటే.. ఈ టోపీలు చెమటను పీల్చుకునే లక్షణం కలిగి ఉంటాయి. వంట చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది. ఇది చెమట పట్టడానికి దారితీస్తుంది. అందువల్ల, చెమటను పీల్చుకునే ధోరణిని కలిగి ఉన్న ఈ టోపీలను పరిశుభ్రత కారణాల దృష్ట్యా వంటవారు ధరిస్తారు. ఇది చెఫ్‌లు పనిలో వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణను కొనసాగించడంలో సహాయపడుతుంది.
