
ఉగాది వేళ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద 38 కోట్ల రూపాయలను ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ నిధులతో 3456 మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటివరకు CMRF కింద 281 కోట్లను విడుదల చేశారు. మరోవైపు 86 మందికి కళారత్న పురస్కారాలను, 116 మందికి ఉగాది పురస్కారాలను సీఎం చంద్రబాబు ప్రదానం చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయడమే తన జీవితాశయం అన్నారు చంద్రబాబు. ఇందుకోసం మార్గదర్శి-బంగారు కుటుంబం, P-4 కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారాయన. ఇదే జరిగితే తన జన్మ చరితార్థం అవుతుందని చంద్రబాబు చెప్పారు.