

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ప్రపంచాన్ని.. మానవాళి ఆలోచన విధాన్ని బాగా ఆకలింపు జేసుకున్నగొప్ప తత్వవేత్త. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు వంటి పేర్లతో ప్రసిద్ధి చెందిన చాణుక్యుడు.. అర్ధ శాస్త్రం, నీతి శాస్త్రం వంటి గొప్ప గొప్ప రచనలు చేశారు. అవి నేటికీ మానవాళి జీవితానికి చాలా సందర్భోచితంగా ఉన్నాయి. నేటి కాలంలో చాణక్య నీతి చాలా ముఖ్యమైనది. చాణక్యుడు తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించాలంటే ఎలా జీవించాలో ప్రస్తావించాడు. జీవితంలో ఆ సూత్రాలను పాటించేవారు ఖచ్చితంగా విజయం సాధించగలరు. చాణక్యుడు ఆర్థిక విషయాల గురించి కూడా మాట్లాడాడు. ఒక వ్యక్తి జీవితంలో ఆర్థికంగా ధనవంతుడు కావాలనుకుంటే.. తప్పని సరిగా కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
సమయం వృధా:
జీవితంలో సమయం చాలా విలువైనది. కాలం ఎవరికోసం ఆగదు. జీవితంలో ఏమీ చేయకుండా సమయాన్ని వృధా చేసే వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటారని చాణక్యుడు చెప్పాడు. సోమరితనంతో జీవించే వారి జీవితంలో ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందులే. ఎందుకంటే వీరికి సమయ పాలన అంటే తెలియదు. దీంతో సమయాన్ని వృధా చేస్తారు. సమయం వృధా అయ్యిందని చింతించరు.
పరిశుభ్రత లేకపోవడం:
వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. అయితే ఎక్కువ మంది ప్రజలు దానికి ప్రాముఖ్యత ఇవ్వరు. అలాంటి వారు జీవితంలో వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా వ్యక్తిగత పరిశుభ్రత లేని వ్యక్తులు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీ దేవి నివసిస్తుంది.
ఇతరులను అవమానించడం:
ఇతరులను అవమానించడం మంచి అలవాటు కాదు. అది మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు ఇలాంటి అలవాటు ఉంటే, వాటిని వదులుకోండి. ఇతరులను అవమానించే వ్యక్తులతో సహవాసం చేయకూడదని చాణక్యుడు కూడా చెప్పాడు. దానివల్ల మీ జీవితంలో సమస్యలు వస్తాయి.
ద్వేషం:
ఎల్లప్పుడూ మనుషుల పట్ల మాత్రమే కాదు సమస్త జీవుల పట్ల కరుణ, ప్రేమతో వ్యవహరించండి. లేకపోతే అది మీ జీవితంలో అనేక సంక్షోభాలకు కారణమవుతుంది. ఆర్థికంగా విజయం సాధించలేరు అని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు