
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. దౌత్యవేత్త. ఆయన విధానాలలో జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన జ్ఞానం, మార్గదర్శకత్వం ఉన్నాయి. చాణక్య నీతిలో ప్రస్తావించబడిన విషయాలు నేటికీ అనుసరణీయం. ఇవి జీవితంలో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరికీ సహాయపడతాయి. ఆచార్య చాణక్యుడి విధానాలు ఇప్పటికీ చాలా మంది జీవితాల్లో మార్గదర్శకంగా పనిచేస్తున్నాయి. ఈ విధానాల్లో చాణక్యుడు ఆదర్శ భర్త ఎలా ఉండాలి, ఆదర్శ భార్య ఎలా ఉండాలి, భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలి వంటి వివిధ అంశాలను కూడా చర్చించాడు. మంచి భార్యకు లేదా మంచి భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఎవరిని మంచి కొడుకు అని పిలవాలి వంటి అనేక ప్రశ్నలకు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో సమాధానమిచ్చాడు.
ఆదర్శవంతమైన భార్య లక్షణాలను వివరిస్తూ.. చాణక్యుడు భార్యకు ఉండవలసిన మూడు లక్షణాలను ప్రస్తావించాడు. మీ భార్యకు ఈ మూడు లక్షణాలు ఉంటే మీ జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు. జీవితంలో మీకు ఎప్పటికీ ఏ లోటు ఉండదు. మీరు జీవితంలో ఎప్పుడూ ఇబ్బందుల్లో పడరని అన్నాడు చాణక్య.
ఈ మూడు లక్షణాలున్న భార్య.. భర్తకు ఓ వరం..
ఇవి కూడా చదవండి
పొదుపు చేసే గుణం: స్త్రీకి ఉండే సహజ గుణాల్లో పొదుపు ఒకటి అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. జీవితంలో సంపాదించిన డబ్బును ఆడంబరాలకు, అనవసర ఖర్చులు చేయకుండా డబ్బులను స్త్రీ పొదుపు చేయాలి. ఎప్పుడైనా అనుకోని విధంగా ఖర్చులు రావచ్చు లేదా చెడు సమయం కలగవచ్చని భావించి సంపాదన లో కొంత భాగమైనా పొదుపు చేసే స్త్రీని ఆదర్శ భార్య అంటారు. ఎందుకంటే అలాంటి స్త్రీలు అవసరమైనప్పుడు తమ భర్తలకు తాము దాచిన డబ్బు ఇస్తారు. అప్పుడు భర్త ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కనుక పొదుపు చేసే గుణం ఉన్న స్త్రీ పురుషుడికి ఒక వరం.
నీతి, నిజాయతీ: భార్యాభర్తలిద్దరూ ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు నమ్మకంతో నీతిగా నిజాయితీగా ఉంటే.. ఆ భార్యాభర్తల జీవితం సంతోషంగా ఉంటుంది. జీవితంలో ఎప్పుడూ ఎటువంటి సమస్యలు ఏర్పడవు. మహిళలు తమ ఇంట్లో శాంతి ఉండేలా చూసుకోవాలి. ఇంటికి వచ్చే అతిథులకు సరైన గౌరవం ఆతిధ్యం ఇవ్వాలి. ఇటువంటి భర్త ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. దీనివల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు.
కృషి, దృఢ సంకల్పం: ఏ స్త్రీకి అయితే కృషి పట్టుదల ఉంటుందో అటువంటి స్త్రీని భర్తగా పొందిన భర్త అదృష్ట వంతుడని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. జీవితంలో ఎటువంటి పరిస్తితులు ఎదురైనా కుంగి పోకుండా భర్తకు అండగా నిలబడుతుంది. కృషి పట్టుదలతో జీవితంలో ముందుకు సాగే విధంగా చేస్తుంది. కనుక ఆచార్య చాణక్యుడి ప్రకారం.. ఈ మూడో గుణాలున్న భార్య భర్తకు ఓ వరం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు