
2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు అజేయంగా నిలిచి, న్యూజిలాండ్‌ను ఓడించి విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ఈ జట్టు టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా, 2013 తర్వాత భారత్‌కు ఇదే మొదటి ఛాంపియన్స్ ట్రోఫీ విజయంగా నిలిచింది. అయితే, ఈ గెలుపు గురించి మాట్లాడటానికి భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నిరాకరించడంతో, ఈ సంఘటన క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక విలేకరి ధోనిని భారత విజయం గురించి ప్రశ్నించగా, ధోని ఎటువంటి సమాధానం ఇవ్వకుండా విమానాశ్రయం నుండి బయటకు వెళ్లిపోయాడు. అంతేకాకుండా, విలేకరికి వెళ్లిపోవాలని సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ధోని సమాధానం ఇవ్వకపోవడాన్ని సహజంగా తీసుకోగా, మరికొందరు అతను జట్టును మద్దతుగా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025కి ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్, మాజీ భారత కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనితో గడిపిన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. అతని మాటల్లో, ధోని సమీపంలో ఉండటమే తన కల అని, తన ఆట జీవితంలో ధోని ప్రభావం చాలా గొప్పదని చెప్పాడు.
సంజు సామ్సన్ మాట్లాడుతూ, “ప్రతి యువ క్రికెటర్‌లాగే, నేను ఎప్పుడూ ఎంఎస్ ధోని చుట్టూ ఉండాలని కోరుకున్నాను. మేము CSKతో మ్యాచ్ ఆడినప్పుడు, అతనితో కూర్చుని మాట్లాడాలని, అతని అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకున్నాను. షార్జాలో CSKతో జరిగిన మ్యాచ్‌లో నేను మంచి స్కోరు చేసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాను. ఆ తర్వాత మహీ భాయ్‌ని కలిశాను. అప్పటి నుంచి మా అనుబంధం మరింత బలపడింది. ఇప్పటికీ మేమిద్దరం తరచుగా కలుస్తుంటాం. నిన్ననే, మళ్లీ అతన్ని కలిశాను. ఇప్పుడతనితో షూటింగ్‌లకు, ఈవెంట్లకు వెళ్తున్నాను. ఇది నిజంగా ఆశీర్వాదం అనిపిస్తుంది” అని పేర్కొన్నారు.
ధోని గురించి అభిమానులు ఎంతగానో ముచ్చటిస్తుంటారు. 2025 IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని తన ఆరో టైటిల్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. CSK తమ మొదటి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో చెపాక్ స్టేడియంలో ఆడనుంది. రుతురాజ్ గైక్వాడ్ CSK కొత్త కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ధోని జట్టులో కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
ఒకవైపు ధోని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా చర్చనీయాంశమవుతుండగా, మరోవైపు అతని IPL ప్రయాణం, CSKలో అతని భవిష్యత్తు, సంజు సామ్సన్ వంటి యువ క్రికెటర్లపై అతని ప్రభావం ఇంకా ఎక్కువగా చర్చించబడుతున్నాయి. 2025 సీజన్ అతనికి చివరి ఐపీఎల్‌గా మారుతుందా? లేక మరోసారి ధోని తన మ్యాజిక్ చూపిస్తాడా? అన్నది చూడాలి.
🚨See how much insecure he is He don’t want to speak even on India’s Champions Trophy Victory
❗️Yuvraj Singh Father was Right ye nahi chahta tha ki dusre ki kaptani me koi world cup jite islie isne 2019 me aise pari kheli❗️
It’s SHAMEFUL👎 pic.twitter.com/t0BiAcBmit
— Imsajal45 (@Sajalsinha0264) March 11, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..