
భారత క్రికెట్ జట్టు ప్రముఖ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకుల కేసు ఇటీవల సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ధనశ్రీ, ఈ వ్యవహారంపై వివిధ రకాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే కొన్ని మీడియా నివేదికలు, విడాకులు ఫైనల్ అయ్యాయి అని ప్రకటించినప్పటికీ, ధనశ్రీ న్యాయవాది అలాంటి ఆరోపణలను ఖండించారు. సోషల్ మీడియాలో చాహల్-ధనశ్రీ ఇద్దరూ రహస్యమైన సందేశాలు పోస్ట్ చేయడం, ఈ వ్యవహారాన్ని మరింత ముదిర్చింది.
“మహిళలను నిందించడం ఎప్పుడూ ఫ్యాషన్‌లో ఉంటుంది!” అంటూ సోమవారం, ధనశ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక రహస్యమైన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ పోస్టు హల్చల్ రేపడంతో, నెటిజన్లు దీన్ని యుజ్వేంద్ర చాహల్ తో అనుసంధానించారు. అయితే, కొంతమంది మాత్రం ఇది ఆమె సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌కు స్పందన అని అభిప్రాయపడ్డారు.
ఈ విడాకుల కేసుపై ధనశ్రీ న్యాయవాది అదితి మోహన్ స్పందిస్తూ, మీడియా వాస్తవాలను నిర్ధారించుకొని ప్రచురించాలని సూచించారు. “ఈ కేసు విచారణలో ఉన్నందున, నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ చాలా తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారంలో ఉంది. మీడియా నివేదికలు ఇచ్చే ముందు వాస్తవాలను తనిఖీ చేయాలి” అని తెలిపారు.
ఈ ప్రకటనతో ధనశ్రీ-చాహల్ మధ్య అసలు పరిస్థితి ఏమిటనేది ఇంకా అర్థంకావడం లేదు. కానీ మీడియా పుకార్లు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
గత కొంతకాలంగా ధనశ్రీ, చాహల్ విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, ధనశ్రీ చాహల్ వద్ద నుంచి రూ. 60 కోట్లు భరణం కోరిందనే ఆరోపణలు మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ధనశ్రీ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. “ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ధనశ్రీ ఎలాంటి డిమాండ్ చేయలేదు, రూ. 60 కోట్లు తీసుకోలేదు. దయచేసి నిర్ధారణ లేని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు” అని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో కొత్త మలుపు ఏంటంటే, చాహల్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా ప్రముఖ ఆర్జే మహ్వాష్తో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవ్వడంతో, ధనశ్రీ – చాహల్ విడాకుల పుకార్లు మరింత బలంగా వినిపించాయి.
నెటిజన్లు “ధనశ్రీ అంటే చాహల్‌కు అసలు సంబంధమే లేదా?”, “ఇప్పటికే కొత్త సంబంధానికి శ్రీకారం చుట్టాడా?” వంటి కామెంట్లతో చాహల్‌ను టార్గెట్ చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..